Post Office Scheme: మీ పెట్టుబడి డబుల్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం మీ కోసమే..

చిన్న మొత్తాలు పొదుపు చేసుకునేందుకు పోస్ట్ ఆఫీస్ ఎన్నో స్కీములు తీసుకొస్తుంది. అందులో కిసాన్ వికాస్ పత్ర అనే సేవింగ్ స్కీమ్‌లలో ఒకటి. ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు కూడా 6.9 శాతం వద్ద స్థిరంగా ఉంది...

Post Office Scheme: మీ పెట్టుబడి డబుల్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం మీ కోసమే..
Post Office
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 22, 2021 | 1:15 PM

చిన్న మొత్తాలు పొదుపు చేసుకునేందుకు పోస్ట్ ఆఫీస్ ఎన్నో స్కీములు తీసుకొస్తుంది. అందులో కిసాన్ వికాస్ పత్ర అనే సేవింగ్ స్కీమ్‌లలో ఒకటి. ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు కూడా 6.9 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలగా ఉంది. “124 నెలల్లో పెట్టుబడి మొత్తం రెట్టింపు అవుతుంది.” ఈ చిన్న పొదుపు పథకంలో కనీసం రూ.1,000, గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారుడు దగ్గరలో ఉన్న పోస్టాఫీసు KVP ఖాతాలను తెరవచ్చు. ఖాతాను ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్‎కు బదిలీ చేసుకోవచ్చు. KVP సర్టిఫికేట్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి కూడా బదిలీ చేసుకోవచ్చు.

“పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు పెట్టుబడి వ్యవధిలో నిర్ణయిస్తారని సెబీ రిజిస్టర్డ్ టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి చెప్పారు. ఖాతా తెరిచే సమయంలో ఉన్న వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరైనా జనవరి నుండి మార్చి 2020 త్రైమాసికంలో పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర ఖాతాను తెరిచి ఉంటే, మెచ్యూరిటీ సమయంలోవార్షిక వడ్డీ రేటు 7.6 శాతం పొందుతారు. ఇప్పుడు ఖాతా తెరిస్తే ప్రస్తుత వడ్డీ రేటు 6.9 శాతం వర్తిస్తుంది.

KVP వడ్డీ రేటు ఏప్రిల్ నుంచి జూన్ 2020 వరకు 7.6 శాతం నుండి 6.9 శాతానికి తగ్గించారు. ఇది ఇప్పటి వరకు స్థిరంగా ఉంది. కాబట్టి, పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాలో రిటర్న్ రిస్క్ లేనిదని అర్థం చేసుకోవచ్చు. “ఈ పోస్టాఫీసు చిన్న పొదుపు పథకం రిస్క్ లేని వారికి సరిపోతుంది. వారికి కూడా ఇది మంచిది. పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని తప్పనిసరిగా సురక్షితమైన. పెట్టుబడి పెట్టాల్సిన వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను విశ్వసించే వారికి కూడా ఇది మంచిది.” అని సోలంకి అన్నాడు.

Read Also… Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..