AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ని ఏకిపారేస్తున్న నెటిజనులు.. కారణమేమిటంటే..

ఇలాంటి ఫ్లిక్ కార్ట్ ప్రకటించిన ఓ భారీ డిస్కౌంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించగా ఖాతాదారులు వాటిని బుక్ చేసుకున్నారు. అయితే ఆ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్లు రద్దు కావడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లిక్ కార్డ్ మోసానికి పాల్పడిందంటూ సోషల్ మిడియాలో (ఎక్స్)లో అనేక పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ని ఏకిపారేస్తున్న నెటిజనులు.. కారణమేమిటంటే..
Flipkart Scam
Madhu
|

Updated on: Sep 19, 2024 | 4:33 PM

Share

ఆన్‌లైన్ మార్కెట్ నేడు విపరీతమైన ఆదరణ పెరిగింది. ఇంటి దగ్గరే ఉండి మనకు అవసరమైన అన్ని వస్తువులను సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థలు అనేక డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నాయి. ఫెస్టివల్ సేల్, మెగా సేల్, డిస్కౌంట్ల పేరుతో విక్రయాలు జరుపుతున్నాయి. వీటికి కస్టమర్ల నుంచి ఎంతో ఆదరణ లభిస్తుంది. ఇలాంటి ఫ్లిక్ కార్ట్ ప్రకటించిన ఓ భారీ డిస్కౌంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించగా ఖాతాదారులు వాటిని బుక్ చేసుకున్నారు. అయితే ఆ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్లు రద్దు కావడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లిక్ కార్డ్ మోసానికి పాల్పడిందంటూ సోషల్ మిడియాలో (ఎక్స్)లో అనేక పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులతో చేసిన వ్యాఖ్యాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

అసలు విషయమిదే..

ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ అయిత ఫ్లిప్ కార్ట్ కు ఖాతాదారులు భారీగానే ఉన్నారు. అయితే వారి ఆగ్రహానికి మోటరోలా జీ85 5జీ (128జీబీ) స్మార్ట్‌ఫోన్‌ కారణంగా మారింది. దీనిపై 99 శాతం తగ్గింపును ప్రకటించారు. కేవలం రూ. 179కే ఖాతాదారులు పొందే అవకాశం ఉందంటూ ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫైర్ డ్రాప్స్ ప్లాట్‌ఫాంలో ప్రదర్శించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.17,999, భారీ డిస్కౌంట్, డెలివరీ ఛార్జీలతో కేవలం రూ. 222కు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. దీంతో అనేక మంది దీనికి ఆర్డర్లు పెట్టారు.

క్యాన్సిల్ అయిన ఆర్డర్లు..

ఫ్లిప్ కార్ట్ ద్వారా తన ఉత్పత్తులను విక్రయించుకునే గ్రాగూడ్స్ సంస్థ ఖాతాదారుల ఆర్డర్లను అంగీకరించింది. కానీ గంటల వ్యవధిలోనే ఆర్డర్లు అకస్మాత్తుగా రద్దు అయ్యాయి. దీనిపై కస్టమర్లు షాక్ అయ్యారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో అనేక పోస్టులు పెట్టారు. ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులకు సంబంధించిన తప్పుడు వాగ్దానంతో తమను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చాలా మంది తమ ఆర్డర్లను రద్దు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు.

ఎక్స్ లో పోస్టుల దాడి..

భారీ డిస్కౌంట్ పేరుతో ఫ్లిప్ కార్ట్ తమను మోసం చేసిందని కస్టమర్లు ఆరోపించారు. #flipkart scam అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ట్రెండింగ్‌లో ఉన్నాయి, వేలాది మంది వినియోగదారులు తమ ఆందోళనలను లేవనెత్తారు. వాటిలో కొన్ని పోస్టులు ఇవి..

  • ఈరోజు తెల్లవారుజామున మనలో చాలామంది @ఫ్లిప్ కార్ట్ నుంచి @ఓక్స్ ఫైర్ డ్రాప్స్ 99 శాతం ఆఫర్ ద్వారా మోటోరోలా జీ85 5జీ (128 జీబీ)ని ఆర్డర్ చేశాం. విక్రేత గ్రాహ్‌గూడ్స్ రిటైల్ వాటిని అంగీకరించింది. ఉత్పత్తి కూడా షిప్పింగ్ చేసింది. అదే సమయంలో 18:35:48 పీఎంకి ఆర్డర్‌లను అకస్మాత్తుగా రద్దు చేసింది.
  • ఈ విషయంపై ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ సేవను సంప్రదించినప్పుడు, వారు అది ధర లోపం/ఎర్రర్ అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఆఫర్ అధికారికంగా, ఆటోమేటిక్‌గా స్పష్టంగా వర్తింపజేసింది.
  • ఇది బగ్ కాదు, ధర లోపం కాదు, ధర లోపం కాదు. ఇది స్పష్టంగా ఫ్లిప్‌కార్ట్ ఫైర్‌డ్రాప్స్ ఆఫర్, ఇది కొనుగోలు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా వర్తించింది.
  • విక్రేత ఫోన్ కోసం కేవలం రూ .500 పరిహారం అందజేస్తున్నారు. ఆ చిన్న పరిహారం వద్దు, కానీ ఆర్డర్ చేసిన ఉత్పత్తి మాత్రమే కావాలి. మీరు ఫోన్ ఇవ్వలేకపోతే, కనీసం మూడు నుంచి నాలుగు వేల పరిహారం కావాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..