NPS Vatsalya: పిల్లల కోసం కేంద్ర కొత్త పథకం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..

కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మైనర్ల కోసం రూపొందించిన ఈ పథకానికి ఎన్ పీఎస్ వాత్సల్య అని పేరు పెట్టింది. దీని ద్వారా పిల్లల పేరు మీద ఏడాదికి కనీసం రూ.వెయ్యి జమ చేయవచ్చు. వారికి 18 ఏళ్ల నిండిన తర్వాత ఇది సాధారణ పెన్షన్ ఖాతాగా మారుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన ఎన్ పీఎస్ వాత్సల్య పథకం వివరాలు ఇవే..

NPS Vatsalya: పిల్లల కోసం కేంద్ర కొత్త పథకం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..
Nps Vatsalya Scheme
Follow us
Madhu

|

Updated on: Sep 19, 2024 | 5:03 PM

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ధడం కోసం తల్లిదండ్రులు అనేక ప్రణాళికలు తయారు రూపొందిస్తారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా వివిధ పొదుపు పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మైనర్ల కోసం రూపొందించిన ఈ పథకానికి ఎన్ పీఎస్ వాత్సల్య అని పేరు పెట్టింది. దీని ద్వారా పిల్లల పేరు మీద ఏడాదికి కనీసం రూ.వెయ్యి జమ చేయవచ్చు. వారికి 18 ఏళ్ల నిండిన తర్వాత ఇది సాధారణ పెన్షన్ ఖాతాగా మారుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన ఎన్ పీఎస్ వాత్సల్య పథకం వివరాలు ఇవే..

దీర్ఘకాలంలో అధిక రాబడి..

పిల్లల ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేయడం కోసం దీర్ఘకాలంలో అధిక సంపద సృష్టించాలనుకునే తల్లిదండ్రులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)-వాత్సల్య పథకం చాలా ఉపయోగంగా ఉంటుంది. 2024 బడ్జెట్‌లో తొలిసారిగా దీన్ని ప్రకటించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మైనర్లకు ప్రాన్ (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) కార్డులను పంపిణీ చేశారు. దీని ద్వారా సాధారణ ఎన్ పీఎస్ ఫండ్లు అందించే దీర్ఘకాలిక రాబడిని పిల్లలు పొందుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) దీన్ని పర్యవేక్షిస్తుంది.

ఎన్పీఎస్ వాత్సల్య..

  • తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో పిల్లల కోసం సంపదను సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. సాధారణ ఎన్ పీఎస్ ఖాతాల మాదిరిగానే ఈ పథకానికి కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణ ఉంటుంది.
  • 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల తల్లిదండ్రులు దీనికి అర్హులు. పిల్లల పేరుమీద తల్లిదండ్రులు, సంరక్షకులు ఖాతాలను తెరవవచ్చు.
  • ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ కార్యాలయాలు, ఇ-ఎన్ పీఎస్ పోర్టల్ ద్వారా వీటికి ప్రారంభించుకోవచ్చు.
  • ఖాతాను ప్రారంభించడానికి తల్లిదండ్రుల కేవైసీ అవసరం. పిల్లలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు కూడా అందజేయాలి.
  • ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట సంవత్సరానికి కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పిల్లలు మేజర్లయిన తర్వాత అది సాధారణ ఎన్ పీఎస్ ఖాతాకు మారుతుంది.
  • ప్రామాణిక ఎన్ పీఎస్ ఖాతాల మాదిరిగానే తల్లిదండ్రులు ఎన్ పీఎస్ పెన్షన్ ఫండ్ మేనేజర్‌లలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి యాక్టివ్ లేదా ఆటో ఎంపికను ఎంచుకోవచ్చు.
  • పిల్లలు ఎదిగి సొంతంగా ఆదాయం పొందడం ప్రారంభించే సమయానికి పొదుపు చేసిన మొత్తం బాగా పెరుగుతుంది. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులకు పొదుపు క్రమశిక్షణను పెంపొందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా