Indian Railways: దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే రైలు ఇదే… ఏడాదికి ఎన్నికోట్లంటే..?

మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు రైళ్లలోనే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. అత్యంత చౌకయిన, సురక్షితమైన ప్రయాణ సాధనాలలో రైళ్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. దేశంలోని నలుమూలకు రైలు మార్గాలు ఉండడంతో పాటు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ అయినా ప్రయాణం చేయవచ్చు. భారతీయ రైల్వేకి భారీ నెట్ వర్క్ ఉంది. ఏడాది పొడవునా అనేక లక్షల మంది వీటిలో ప్రయాణం చేస్తుంటారు. అయితే దేశంలోని తిరిగి రైళ్లలో దేనికి ఎక్కువ ఆదాయం వస్తుందో తెలుసుకుందాం.

Indian Railways: దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే రైలు ఇదే… ఏడాదికి ఎన్నికోట్లంటే..?
Railways
Follow us
Srinu

|

Updated on: Jan 11, 2025 | 3:17 PM

భారతీయుల జీవితంలో రైలు అనేది అంతర్భాగంగా మారిందనే అనుకోవచ్చు. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రిటీష్ పాలనా కాలంలో 1853లో మన దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ మనది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్ ప్రెస్ తదితర అనేక రైళ్లు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వీటిలో పాటు పాసింజర్, సరకులను రవాణా చేసే గూడ్స్ రైళ్లు అదనంగా ఉన్నాయి. ప్రతి ఏటా మిలియన్ల మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన రవాణా సాధనాలతో పోల్చితే రైలు చార్జీలు బాగా తక్కువ. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో రైల్వేకి భారీగా ఆదాయం వస్తుంది. అలాగే ప్రయాణికుల కోసం అనేక రాయితీలు కూడా అమలవుతున్నాయి. ఇలా ఏడాదికి సుమారు రూ.56,993 కోట్ల ఆదాయం సమకూరుతుంది. వస్తువుల రవాణా నుంచి వచ్చే ఆదాయం దీనికి అదనం.

భారతీయ రైల్వేలో కేఎస్ ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్ ద్వారా అధికాదాయం వస్తోంది. 1969లో ఏర్పాటు చేసిన ఈ రైలు వివిధ రాష్ట్రాల నుంచి రాజధానికి ప్రయాణం సాగిస్తుంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి కేఎస్ ఆర్ బెంగళూరు మధ్య నడుస్తున్న ఈ రైలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం గడించింది. ఆ కాలంలో 5,09,510 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.1,760.67 కోట్లు సంపాదించింది. న్యూఢిల్లీ నుంచి కోల్ కతా మధ్య ప్రయాణం సాగించే సీల్దా ఎక్స్ ప్రెస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 509,164 మందిని రవాణా చేసింది. తద్వారా రూ.1288.17 కోట్ల ఆదాయానికి భారతీయ రైల్వేకి సంపాదించిపెట్టింది. అలాగే న్యూఢిల్లీ నుంచి అసోంలోని దిబ్రూఘర్ మధ్య తిరిగే దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ 2022-23 లో 474,605 మంది ప్రయాణికులకు సేవలు అందించి, రూ.1262.91 కోట్లను ఆర్జించింది.

అనేక ఎక్స్ ప్రెస్ లు, పాసింజర్ రైళ్లు నిరంతరం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యధిక డిమాండ్ ఉన్న కారణంగా రైళ్లలో దూరప్రాంతాలకు ప్రయాణం చేయడానికి టిక్కెట్లను తప్పకుండా రిజర్వేషన్ చేసుకోవాలి. లేకపోతే సీటు దొరకడం కష్టంగా ఉంటుంది. సాధారణ సమయంలోనే రైళ్లు రద్దీగా ఉంటాయి. ఇక పండగలు, ఇతర ముఖ్య సమయాల్లో అయితే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి