AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stocks: ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లు ఏడాదిలో రిచ్ అయ్యారు! ఏకంగా 1573% రిటర్న్స్!

స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్లు ఎక్కువగా పెన్నీ స్టాక్స్ పై ఫోకస్ పెడతారు. పెన్నీ స్టాక్స్ అంటే చాలా తక్కువ ధరకు దొరికే షేర్స్. అవి కొంచెం రిస్క్‌ కలిగి ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు అద్భుతంగా రాణించి మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి కొన్ని బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు చూద్దాం.

Penny Stocks: ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లు ఏడాదిలో రిచ్ అయ్యారు! ఏకంగా 1573% రిటర్న్స్!
Penny Stocks
Nikhil
|

Updated on: Oct 27, 2025 | 3:15 PM

Share

పెన్నీ స్టాక్స్ లో షేర్ వాల్యూ రూ.10 కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ కంపెనీలు బాగా పెర్ఫార్మ్ చేస్తే.. షేర్ వాల్యూ రూ.100 లేదా అంతకంటే ఎక్కువగా కూడా పెరగొచ్చు. ఇలా గత సంవత్సరంలో ఏకంగా 1,500% కంటే ఎక్కువ రాబడిని అందించిన పెన్నీ స్టాక్స్ కూడా ఉన్నాయి.  ఇవి కేవలం రూ.10 కంటే తక్కువ షేర్ వాల్యూతో మొదలై ఏడాదిలో మంచి పెర్ఫామెన్స్ సాధించి రూ. 50 నుంచి రూ.100 మధ్యకు చేరుకున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్లు ఏడాదిలో రిచ్ అయిపోయారు. ఇంతకీ ఆ స్టాక్స్ ఏంటంటే..

ఐస్ట్రీట్ నెట్‌వర్క్ లిమిటెడ్

ఈ కంపెనీ షేర్లు నవంబర్ 2024లో రూ.2.90 నుండి అక్టోబర్ 2025లో రూ.48.87కి పెరిగాయి. అంటే సంవత్సరం క్రితం ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇప్పుడు రూ.16.85 లక్షల రిటర్న్ వస్తుంది. ఈ స్టాక్ గత సంవత్సరంలో 1573.63% రాబడిని ఆర్జించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.104 కోట్లు.

రాజస్థాన్ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగ్ 

ఈ కంపెనీ షేరు ధర రూ.3.06 నుండి రూ.41.98కి పెరిగింది. అంటే ఇందులో రూ. లక్ష పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు దాదాపు రూ.13.57 లక్షల ఆదాయం వస్తుంది. గత సంవత్సరంలో ఇది 1099.09% రాబడిని ఆర్జించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.189 కోట్లు.

విఆర్ వుడార్ట్ లిమిటెడ్

ఈ కంపెనీ షేరు ధర రూ.4.80 ఉండగా.. ఏడాదిలో షేర్ ధర రూ.55.40కి చేరుకుంది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి రూ.11.54 లక్షలకు పెరిగింది. గత సంవత్సరంలో కంపెనీ 1054% రాబడిని అందించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.83 కోట్లు.

యువరాజ్ హైజీన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్

ఈ కంపెనీ షేర్లు రూ.2.04 నుండి రూ.16కి పెరిగాయి. రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు దాదాపు రూ.7.83 లక్షలకు చేరుకుంది. గత సంవత్సరంలో ఈ కంపెనీ 684.31% రాబడిని ఆర్జించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.145 కోట్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి