Trains cancelled: తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 43 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే
Trains cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల నేఫథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగిచే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమక్రమంగా బలపడి మొంతా తుఫాన్‌గా రూపాంతరం చెందింది.ఈ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత దృష్ట్యా విశాఖ మీదుగా నడిచే 43 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్ల సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటూ రద్దు చేసిన రైల్వే సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. దానితో పాటు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచింది. తుఫాను తీవ్రతను బట్టి తరువాత సర్వీసులను పునరుద్దరిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
In view of Cyclone “MONTHA”, East Coast Railway has cancelled several trains for passenger safety. Please check train status before travel.#ECoRupdate #CycloneMontha #PassengerSafety #IndianRailways @RailMinIndia pic.twitter.com/RCVuco40nq
— East Coast Railway (@EastCoastRail) October 27, 2025
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను క్రమంగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. ఈ మొంథా తుపాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




