Best SUV: ఇండియాలో టాప్-5 బెస్ట్ SUV లు ఇవే.. ధర కూడా తక్కువే..!
ఫ్యామిలీ మొత్తం హాయిగా ట్రావెల్ చేయాలంటే కచ్చితంగా ఎస్‌యూవీ (SUV) ఉండాల్సిందే. ఇప్పుడు SUVలు కూడా చిన్న కార్ల ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ SUVలు చాలా సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బెస్ట్ SUVల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

బడ్జెట్ లో SUV కోసం చూస్తున్నవాళ్లకు డీజిల్ SUVలు మంచి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ ధరలు తక్కువగా ఉండడమే కాకుండా డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీ కూడా ఇస్తాయి. అంతేకాదు డీజిల్ ఇంజిన్లు ఎక్కువ పవర్, టార్క్ ను జనరేట్ చేస్తాయి. మనదేశంలో రూ.10 లక్షల లోపు మంచి SUVలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ఇంజన్ స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో భారతదేశంలో అత్యంత చౌకైన డీజిల్ SUV అని చెప్పొచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. కంపెనీ ఇటీవల బొలెరోను కొత్త డిజైన్, ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ SUV .. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
మహీంద్రా బొలెరో నియో
ఇది బొలెరో యొక్క ప్రీమియం వెర్షన్. ధర రూ. 8.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బొలెరో నియో కూడా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే పవర్ అవుట్ పుట్ కొంచెం ఎక్కువ. అలాగే బొలెరోతో పోలిస్తే.. బొలెరో నియో ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
మహీంద్రా XUV 3XO
ఇది మహీంద్రా యొక్క సరికొత్త కాంపాక్ట్ SUV. దీని ధరలు రూ. 8.95 లక్షల నుంచి మొదలవుతాయి. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. అలాగే ఇందులో ఆటో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంది. దీని సైజు చిన్నగా ఉంటుంది. స్పోర్టీ డిజైన్ తో వస్తుంది.
కియా సోనెట్
కియా సోనెట్ ధర రూ. 8.98 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ SUVలలో ఒకటి. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో వస్తుంది. అర్బన్, సెమీ-అర్బన్ వేరియంట్లలో లభిస్తుంది.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV లలో ఒకటి. ధరలు రూ. 9.01 లక్షల నుండి ప్రారంభమవుతాయి. దీని డీజిల్ వెర్షన్.. 1.5-లీటర్ 6-స్పీడ్ మాన్యువల్/ AMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు 5 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
