Personal Loan: క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా.. లోన్ పొందొచ్చు! ఎలాగంటే..
కొన్నిసార్లు అత్యవసరంగా సమయంలో డబ్బు అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితులలో పర్సనల్ లోన్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్. అయితే ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ 600 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీకు పర్సనల్ లోన్ అప్రూవ్ అవ్వడం కొంచెం కష్టం కావచ్చు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి?

క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా దాన్ని బ్యా్డ్ క్రెడిట్ స్కోర్ గా పరిగణిస్తారు. వీళ్లకు పర్సనల్ లోన్ రావడం కాస్త కష్టమే. ఇలాంటి సందర్భాల్లో నేరుగా లోన్ కు అప్లై చేస్తే కచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. అందుకే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవాళ్లు లోన్ కు అప్లై చేసేముందు కొన్ని ఆప్షన్స్ పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాకట్టు పెట్టి..
మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ మీకు పర్సనల్ లోన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మీ దగ్గర ఉన్న స్థిరాస్తులను తాకట్టుగా పెట్టొచ్చు. ఉదాహరణకు ఇల్లు లేదా బంగారం వంటివి. ఇలాంటివి తాకట్టుగా పెట్టడం ద్వారా ఈజీగా లోన్ లభిస్తుంది. అయితే సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఇబ్బందులు ఏర్పడొచ్చు.
హామీ దారుడి సాయంతో..
ఒకవేళ మీ దగ్గర స్థిరాస్తులు ఏమీ లేకపోతే మీరు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తిని హామీ దారుడిగా పెట్టి లోన్ పొందొచ్చు. దానికోసం అవతలి వ్యక్తి శాలరీ స్లిప్‌లు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
లోన్ యాప్స్
ఇకపోతే తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవాళ్లు కొన్ని లోన్ యాప్స్ ద్వారా కూడా లోన్స్ తీసుకోవచ్చు. ఇలాంటి లోన్స్ కు వడ్డీ ఎక్కువ ఉంటుంది. అయితే యాప్స్ ఎంచుకునేటప్పుడు అది RBI ఆమోదించిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి.
స్కోర్ పెరగాలంటే..
క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిసారీ అవి వర్కవుట్ అవ్వకపోవచ్చు. అందుకే ముందుగా స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏదోవిధంగా మీ పేరు మీద లోన్ తీసుకుని దాన్ని క్రమం తప్పకుండా సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




