Financial Tips: సంపాదన చాలడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి.. తప్పక మిగులు కనిపిస్తుంది..
మనకు వనరులు లేనప్పుడు, ఇంకా అధికంగా డబ్బు సంపాదించే అవకాశం కనిపించనప్పుడు అన్ని పరిమితంగా అనిపిస్తాయి. అలాంటి సందర్భంలో మనలో నిర్లిప్తత ఆవహిస్తుంది. అంటే అవసరం ఉన్నా చేతిలో డబ్బులు లేని కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి. దీనినే ఇంగ్లిష్ లో క్రాష్ క్రంచ్ అని అంటారు. అయితే ఇటువంటి పరిస్థితులను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీరు చేయవలసినదల్లా కాస్త బోర్డర్ దాటి తెలివిగా ఆలోచించడమేనని సూచిస్తున్నారు

మనలో చాలా మంది సంపాదించే డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా చిల్లు జేబులో వేసిన చందంగా మారుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. మన ఖర్చులకూ చేతిలో డబ్బులు లేవే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అటువంటి అనుభవం కలగడం సాధారణం. ఇది కొన్ని సందర్భాల్లో మనసులో వ్యతిరేక భావాలను కూడా కలిగిస్తుంటుంది. మనకు వనరులు లేనప్పుడు, ఇంకా అధికంగా డబ్బు సంపాదించే అవకాశం కనిపించనప్పుడు అన్ని పరిమితంగా అనిపిస్తాయి. అలాంటి సందర్భంలో మనలో నిర్లిప్తత ఆవహిస్తుంది. అంటే అవసరం ఉన్నా చేతిలో డబ్బులు లేని కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి. దీనినే ఇంగ్లిష్ లో క్రాష్ క్రంచ్ అని అంటారు. అయితే ఇటువంటి పరిస్థితులను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీరు చేయవలసినదల్లా కాస్త బోర్డర్ దాటి తెలివిగా ఆలోచించడమేనని సూచిస్తున్నారు. మన ఆదాయానికి తగిన విధంగా ఖర్చులను చేయడం, బాధ్యతాయుతంగా, తెలివిగా డబ్బును ఖర్చు పెట్టడం చేస్తుండాలని సూచిస్తున్నారు. ఈ క్యాష్ క్రంచ్ ఫీలింగ్‌ను ఎలా అధిగమించాలనే దానిపై నిపుణులు సూచిస్తున్న కొన్ని ఆర్థిక టిప్స్ ఇప్పుడు చూద్దాం..
బడ్జెటింగ్.. మీ ఆదాయాలు, ఖర్చుల గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి బడ్జెట్‌ను రూపొందించండి.
ఖర్చు ట్రాకింగ్.. మీ రోజువారి ఖర్చులను ట్రాక్ చేయాలి. ఎక్కడ తగ్గించుకోవచ్చో అంచనా వేసుకోవాలి. వాటిని పొదుపు వైపు మళ్లించాలి.
ఆర్థిక లక్ష్యాలు.. మీకు నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. అందుకోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోవడం మేలు. మీ ఆకాంక్షలు, పరిస్థితులకు అనుగుణంగా వాస్తవిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం ముఖ్యం. రాత్రిపూట మీ ఆర్థిక పరిస్థితిని సమూలంగా మార్చే ప్రలోభాలను నివారించండి. బదులుగా, ఆర్థిక స్థిరత్వం వైపు మీ ప్రయాణాన్ని నడిపించే మైలురాళ్లను ఎంచుకోవాలి. మీరు ఈ లక్ష్యాలను సాధించినప్పుడు, మీ ఆర్థిక నిర్వహణలో మీ విశ్వాసం పెరుగుతుంది.
అవసరాలు, కోరికలు.. ఖర్చును సమర్ధవంతంగా నిర్వహించాలంటే మీ కోరికల కంటే అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక ప్రణాళికలో చురుకైన విధానాన్ని తీసుకోవాలి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ ప్రాధాన్యాల ఆధారంగా మీ ఖర్చులను నియంత్రించాలి. ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంపద అనేది భౌతిక ఆస్తులను కూడబెట్టుకోవడంలో కాదు కానీ అర్థవంతమైన అనుభవాల సాధనలో, మీ అభిరుచులకు అనుగుణంగా, విలువలతో కూడిన జీవితం గడపడమేనని నిపుణులు చెబుతున్నారు.
అత్యవసర నిధి.. అత్యవసర నిధిని సృష్టించడానికి మూడు నుంచి ఆరు నెలల విలువైన మీ జీతాన్ని పక్కన పెట్టండి. ఇది మీకు ఆరోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో మీకు ఉపయోగపడుతుంది.
పెట్టుబడి, పొదుపు.. పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. కొంత కాలానికి మీ సంపదను పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి. అప్పుడు మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంపదను కూడబెట్టుకొనే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




