AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand EVs: పాత ఈ-స్కూటర్ కొంటున్నారా.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి..

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ వాటి ధర కొంచె ఎక్కువగానే ఉంటుంది. రూ.లక్షకు పైగా వెచ్చించి వీటిని కొనుగోలు చేయడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వీలుండకపోవచ్చు. ఇలాంటి వారి కోసం సెకండ్ హ్యాండ్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. చాాలా తక్కువ ధరకే ఇవి దొరుకుతాయి. అయితే వీటిని కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.

Second Hand EVs: పాత ఈ-స్కూటర్ కొంటున్నారా.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి..
Electric Scooter
Madhu
|

Updated on: Jul 21, 2024 | 6:17 PM

Share

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగంగా విపరీతంగా పెరిగింది. మార్కెట్ లో వీటి విక్రయాలు దూసుకుపోతున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ముఖ్యంగా మహిళలకు ప్రథమ ఎంపికగా మారుతున్నాయి. నగర ట్రాఫిక్ లో సులభంగా డైవింగ్ చేసే వీలుండడంతో పాటు చార్జింగ్ సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వం అందిస్తున్నసబ్సిడీ తదితర కారణాలు వీటి వినియోగం పెరగడానికి ముఖ్య కారణమవుతున్నాయి.

సెకండ్ హ్యాండ్ స్కూటర్లు..

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ వాటి ధర కొంచె ఎక్కువగానే ఉంటుంది. రూ.లక్షకు పైగా వెచ్చించి వీటిని కొనుగోలు చేయడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వీలుండకపోవచ్చు. ఇలాంటి వారి కోసం సెకండ్ హ్యాండ్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. చాాలా తక్కువ ధరకే ఇవి దొరుకుతాయి.

విస్తరిస్తున్న మార్కెట్..

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. తక్కువ ధరకు మంచి మోడళ్లను విక్రయించే సంస్థలు, వెబ్ సైట్లు కూడా ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఈఎమ్ఐ విధానంలో స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ప్రతి రోజూ మార్కెట్ లోకి రోజుకో మోడల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం వస్తోంది. దీంతో గతంలో ఈవీలను కొనుగోలు చేసిన వారు, కొంత కాలం ఉపయోగించిన తర్వాత వాటిని అమ్మేస్తున్నారు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

చార్జింగ్.. పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా పరిశీలించండి. దానిలోని ప్రతి భాగాన్ని తనిఖీ చేయండి. బండిపై ఏమైనా గీతలున్నాయా, పార్టులు విరిగిపోయాయా అనే విషయాన్ని గమనించండి. అన్నిటికన్నా ముందు చార్జింగ్ పెట్టండి. అది సక్రమంగా పనిచేస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

టెస్ట్ డ్రైవ్.. వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. కొంత దూరం స్వయంగా నడిపి చూడండి. అప్పుడే దానిలోని లోటుపాట్లు తెలుస్తాయి. బండి కండీషన్ అర్థమవుతుంది. రన్నింగ్ సమయంలో సమస్యలుంటే గుర్తించే అవకాశం కలుగుతుంది.

రికార్డుల పరిశీలన.. వాహనం సర్వీస్ రికార్డును పూర్తిగా పరిశీలించండి. అది మీకు చాలా అవసరం అవుతుంది. అలాగే స్కూటర్ ఇతర భాగాలను కూడా బాాగా పరిశీలన చేయండి

ఇన్స్యూరెన్స్.. బండికి సంబంధించిన పత్రాలలో బీమా పత్రాలు చాలా ముఖ్యం. దాని గడువు ముగిసిపోతే సంబంధిత యజమానికి సంప్రదించండి. అలాగే బీమా పత్రాలను మీ పేరు బదిలీ చేసుకోవడం మర్చిపోవద్దు.

ఎన్ఓసీ.. స్కూటర్ పై లోన్ ఉందేమో పరిశీలించండి. దాన్ని గతంలో లోన్ పై కొనుగోలు చేసినట్టయితే యజమానికి నుంచి నో అబ్జెక్ష్ న్ సర్టిఫికెట్ (ఎన్ వోసీ) తీసుకోవాలి. పైన చెప్పని అంశాలన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా పాత స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..