AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: ఆ వస్తువులపై రూపాయి డిస్కౌంట్‌! ఫుట్‌బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు.. పూర్తి వివరాలు..

స్మార్ట్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమెజాన్ భారీ తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. జూలై 20, 21 తేదీలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగుతోంది. అయితే ఈ సేల్ లో కొన్ని వస్తువులపై కేవలం ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Amazon Sale: ఆ వస్తువులపై రూపాయి డిస్కౌంట్‌! ఫుట్‌బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు.. పూర్తి వివరాలు..
Amazon Prime Day Sale
Madhu
|

Updated on: Jul 21, 2024 | 5:56 PM

Share

అమెజాన్ ప్రైమ్ డే సేల్ అంటే వినియోగదారులకు పండగే. అతి తక్కువ ధరలకు అనేక వస్తువులను సొంతం చేసుకునే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమెజాన్ భారీ తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. జూలై 20, 21 తేదీలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగుతోంది. అయితే ఈ సేల్ లో కొన్ని వస్తువులపై కేవలం ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రెండు రోజుల సేల్..

అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 20 ప్రారంభమై రెండు రోజులు జరుగుతుంది. దీనిలో ప్రైమ్ మెంబర్లకు వివిధ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నారు. అనేక టాప్ బ్రాండ్‌లపై ఎపిక్ డీల్స్ అందిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. వివిధ రకాల వస్తువులపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

నెటిజన్ల పోస్టులు..

అమెజన్ సేల్ లో కొన్ని వస్తువులపై అత్యంత తక్కువ తగ్గింపు ఇస్తున్నట్టు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే డిస్కౌంట్ లభించిందని చెబుతూ ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు. వీటిని చూపుతూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

  • ఒక సోషల్ మీడియా వినియోగదారు ఒక స్క్రీన్‌షాట్‌ను అప్ లోడ్ చేశారు. దానిలో రూ.3,499 విలువైన ఒక వస్తువు రూ.3,498కి అందుబాటులో ఉన్నట్లు చూపుతోంది. అంటే కేవలం ఒక్క రూపాయి మాత్రమే తగ్గింపు లభిస్తుంది.
  • మరొకరు రూ.1,16,000 విలువైన వస్తువు రూ.1,15,990 అందుబాటులో ఉన్నట్టు పోస్ట్ చేశారు. అంటే కేవలం పది రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • మరొకరు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన వైర్‌లెస్ పవర్‌బ్యాంక్ కొనాలనుకుని ప్రైమ్ సేల్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకూ దాని ధర రూ. 1600. నేడు సేల్ లో రూ.1708 గా ఉందని, బ్యాంకు కార్డు ద్వారా దానిపై రూ.80 క్యాష్ బ్యాక్ ప్రకటించారని తెలిపారు.
  • ఈ డిస్కౌంట్లపై నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)లో అమితాబ్ బచ్చన్ మాట్లాడినట్టుగా “క్యా కీజియేగా ఇత్నీ ధనరాశి కా (ఇంత సంపదతో మీరు ఏమి చేస్తారు) అంటూ చమత్కరించారు.

అమెజాన్ ప్రైమ్ డే డీల్స్..

అమెజాన్ డిస్కౌంట్లు ఆటోమేటెడ్ సిస్టమ్స్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉపయోగించి నిర్ణయిస్తారు. ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లు, మరికొన్నింటిపై అమెజాన్ 65 శాతం వరకూ తగ్గింపులు అందిస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేయబడిన పోస్టులు చాలా అసాధారణమైనవి చెప్పవచ్చు.

అందుబాటులో..

అమెజన్ ప్రైమ్ డే సేల్ లో అనేక వస్తువులు అత్యంత తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 65 శాతం డిస్కౌంట్ తో పాటు బ్యాంకు కార్డు ఆఫర్లు, ఎక్స్చేంచ్ అవకాశం కూడా ఉంది. కొన్ని ఉత్పత్తులపై కొంబో డీల్ కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..