Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST exemption: అపార్టుమెంటులో ఉంటే జీఎస్టీ కట్టాలా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..?

దేశంలోని ప్రతి ఒక్కరికీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) గురించి తెలిసిందే. వినియోగదారులందరూ కేంద్రం విధించిన ఈ పరోక్ష పన్నును చెల్లిస్తూ ఉంటారు. దీని ద్వారా విడివిడిగా ఉన్న పన్నులను ఒకే రూపంలోకి తీసుకువచ్చారు. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, వివిధ సేవలు పొందినప్పుడు వాటికి ధరకు అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అయితే అపార్టుమెంట్ నిర్వహణ మొత్తం పరిమితి దాటితే కూడా జీఎస్టీ కట్టాల్సి ఉంది. ఆ నిబంధనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

GST exemption: అపార్టుమెంటులో ఉంటే జీఎస్టీ కట్టాలా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..?
Apartments
Follow us
Srinu

|

Updated on: Apr 15, 2025 | 6:00 PM

ఒక హౌసింగ్ సొసైటీ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే, వ్యక్తిగతంగా ఫ్లాట్ యజమాని నెలకు రూ.7500 కంటే ఎక్కువ నిర్వహణ వెచ్చిస్తుంటే జీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. దాని ప్రకారం సుమారు 18 శాతం జీఎస్టీ కట్టాలి. దీని వల్ల ఫ్లాట్ యజమానుల ఖర్చులు మరింత పెరుగుతాయని, ఆర్థిక భారంగా మారతాయని చెబుతున్నారు. జనవరి 2018లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. ఫ్లాట్ నిర్వహణ చార్జీల మినహాయింపు పరిమితిని నెలకు రూ.5 వేల నుంచి రూ.7500కు పెంచారు. ఉదాహరణకు ఫ్లాట్ నిర్వహణ కోసం నెలకు రూ.9 వేలు చెల్లిస్తుంటే, మీ సొసైటీ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీకు జీఎస్టీ వర్తిస్తుంది. అదనంగా రూ.1,620 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దాని వల్ల మీ నెలవారీ ఫ్లాట్ ఖర్చు సుమారు రూ.10, 620 అవుతుంది.

జీఎస్టీ విధింపుపై అపార్టుమెంటు నివాసితుల్లో కొంత అయోమయం నెలకొంది. దీంతో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత నిచ్చింది. దాని ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్ డబ్ల్యూఏ మొత్తం టర్నొవర్ రూ.20 లక్షలు దాటకుండా, అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటినెన్స్ చార్జీలు నెలకు రూ.7500 కన్నా తక్కువగా ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం. ఆ మొత్తం దాటితే మాత్రం తప్పకుండా కట్టాల్సి ఉంటుంది.

అపార్టుమెంట్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్ డబ్ల్యూఏ)లో రెండు కంటే ఎక్కువ ఫ్లాట్లు కలిగిన వారికి కూడా కొన్ని నిబంధనలు అమలవుతాయి. వీరికి పన్నును ఎలా లెక్కించాలనే దానిపై కూడా క్లారిటీ లభించింది. ఈ సందర్భాల్లో ప్రతి సభ్యుడికి నెలకు రూ.7500 గరిష్ట పరిమితిని అతడి యాజమాన్యంలోని ప్రతి రెసిడెన్సియల్ అపార్టుమెంట్ కు విడిగా వర్తింపజేస్తారు. కాాగా.. నివాసితులు ముందుగా అపార్టుమెంటు లేదా ఆర్ డబ్ల్యూఏని జీఎస్టీ కింద నమోదు చేశారో, లేదో తెలుసుకోవాలి. వారి హౌసింగ్ సొసైటీ వార్షిక టర్నోవర్ లెక్కలను గమనించాలి. ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాలను నివాసితులను అందించవచ్చో లేదో చర్చించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి