- Telugu News Photo Gallery Business photos Maruti suzuki grand vitara launched at rs 11 42 lakh improves on standard safety adds new features details in telugu
Maruti suzuki grand vitara: అదిరే ఫీచర్లతో గ్రాండ్ విటారా నయా వెర్షన్.. ధర ఎంతో తెలిస్తే షాక్
భారతదేశంలో చాలా ఏళ్లుగా మారుతీ సుజుకీ కార్ల కొనుగోలుకు ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా బడ్జెట్ ధరల్లో ఫ్యామిలీ కార్లు అందించే మారుతీ కంపెనీను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మారుతీ సుజుకీ తన గ్రాండ్ విటారీ 2025ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. సూపర్ ఫీచర్స్‌తో పాటు మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండే ధరతో ఈ కారును లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ నయా కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 15, 2025 | 6:24 PM

2025 గ్రాండ్ విటారా భారతదేశంలో ఇటీవల లాంచ్ చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ మెరుగైన ప్రామాణిక భద్రతా ఫీచర్లతో పాటు అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

గ్రాండ్ విటారా తాజా అప్‌డేట్ ఇటీవల టయోటా చేసిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు చేసిన అప్‌డేట్‌లకు అనుగుణంగా చేశారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా 2025 అప్‌డేట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రతకు ప్రయాణికుల తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భద్రతా కిట్ల జాబితాకు యాడ్ చేశారు. వీటిలో ఈఎస్‌పీ, హిల్-అసిస్ట్, డిస్క్ బ్రేక్లు, ఈబీడీ, ఐఎస్‌ఓ ఫిక్స్ ఉన్నాయి.

2025 మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారను కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి ఎస్‌యూవీకు సంబంధించిన జీటా+, ఆల్ఫా+, జీటా+ (ఓ), ఆల్ఫా+ (ఓ) స్టాంగ్ హైబ్రిడ్ లైనప్‌లో చేరాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా నయా వేరియంట్లలో సన్రూఫ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్‌తో వచ్చిన ఇతర లక్షణాలను పరిగణలోకి తీసుకుంటే 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఏటీ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎల్‌ఈడీ క్యాబిన్ ల్యాంప్‌లతో పాటు బ్యాక్ డోర్ సన్ షేడ్లు ఉన్నాయి.





























