AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi YU7: సింగిల్ చార్జ్‌పై 835 కిలోమీటర్ల మైలేజ్.. అదరగొడుతున్న చైనా కారు

చైనాకు చెందిన షియోమి కంపెనీ గురించి మన దేశంలో అందరికీ తెలిసిందే. ఈ సంస్థ విడుదల చేసే స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఆధునిక ఫీచర్లు, డిజైన్ తో ఫోన్లు విడుదల చేస్తూ మన దేశ మార్కెట్ లో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు షియోమి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోని ప్రవేశించింది. వైయూ7 పేరుతో లగ్జరీ ఎస్ యూవీని ప్రపంచ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ కారు ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Xiaomi YU7: సింగిల్ చార్జ్‌పై 835 కిలోమీటర్ల మైలేజ్.. అదరగొడుతున్న చైనా కారు
Xiaomi Yu7
Nikhil
|

Updated on: May 24, 2025 | 3:39 PM

Share

షియోమి వైయూ7 పేరుతో విడుదలైన ఈ కారు డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. గాలిపై స్వారీ అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు. దీని ప్రత్యేకతల్లోకి వెళితే ముందుగా రేంజ్ గురించి చెప్పుకోవాలి. పూర్తిస్థాయి సింగిల్ చార్జిపై సుమారు 835 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. కారు పొడవు 4,999 ఎంఎం, వెడల్పు 1,996 ఎంఎం, ఎత్తు 1600 ఎంఎం, వీల్ బేస్ 3000 ఎంఎం కొలతలతో తయారు చేశారు.

మూడు రకాల ఆకర్షణీయమైన రంగుల్లో షియోమి కారు ఆకట్టుకుంటోంది. ఎమరాల్డ్ గ్రీన్, టైటానియం సిల్వర్, లావా ఆరెంజ్ కలర్లలో సూపర్ లుక్ తో తీసుకువచ్చారు. కేవలం 3.23 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగం అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. గరిష్టంగా గంటకు 253 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ప్రత్యేకతల విషయానికి వస్తే గరిష్ట రివల్యూషన్ ను 22,000 ఆర్ పీఎంకు పెంచారు. 528 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. దీనిలోని డ్యూయల్ మోటారు ఫోర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ద్వారా గరిష్టంగా 680 బీహెచ్ పీ హార్స్ పవర్, 508 కేడబ్ల్యూ గరిష్ట శక్తి పొందుతుంది. దీంతో కారు పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది.

షియోమి వైయూ7 కారును మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటికి స్టాండర్డ్, ప్రో, మాక్స్ అని పేర్లు పెట్టారు. వీటిలో స్టాండర్డ్ వేరియంట్ ను బేస్ మోడల్ అని చెప్పవచ్చు. దీనిలో 96.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జిపై సుమారు 835 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రెండో వేరియంట్ అయిన ప్రో మోడల్ కారులో 96.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. దీని రేంజ్ సుమారు 760 కిలోమీటర్లు. చివర వేరియంట్ అయిన మాక్స్ లో 101.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సుమారు 770 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

అత్యంత వేగవంతంగా చార్జింగ్ కావడం ఈ కారు బ్యాటరీల మరో ప్రత్యేకత. 897 వీ పీక్ వోల్టేజ్ తో 800 వీ సిలికాన్ కార్బైడ్ హై వోల్టేజ్ ప్లాట్ ఫాం కారణంగా తొందరగా చార్జింగ్ అవుతాయి. కేవలం 12 నిమిషాల్లో పది శాతం నుంచి 80 శాతం చార్జింగ్ అవుతుంది. కేవలం 15 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే సుమారు 620 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. కాగా.. చైనా కంపెనీ షియోమి నుంచి ఎప్పటికే ఎస్ యూ7 పేరుతో ఎస్ యూవీ విడుదలైంది. దాన్ని విడుదల చేసిన 27 నిమిషాల్లోనే 50 వేల ఆర్డర్లు వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ కార్ల ద్వారా భారతదేశంలోని ఎలక్ట్రిక్ మార్కెట్ లో తన వాటా పెంచుకోవాలని షియోమీ భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..