AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Account: కంపెనీ మారారా? పీఎఫ్ ఖాతా మార్చుకోవడం ఎలా? ఇలా చేయండి..

సాధారణంగా ఒక సంస్థలో పనిచేసిన ఉద్యోగి కొన్నాళ్ల తర్వాత వేరే సంస్థకు మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వృద్ధి కోసం, ఎక్కువ వేతనం వచ్చే అవకాశం ఉన్నపుడు ఈ నిర్ణయం తీసుకుంటారు. నూతన సంస్థలో చేరినప్పుడు కొత్త యజమాని కూడా ఆ ఉద్యోగికి ఈపీఎఫ్ ఖాతా తెరుస్తారు. మళ్లీ యూఏఎన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇక్కడే ఒక సమస్య ఏర్పడుతుంది. ముందు సంస్థలో కేటాయించిన యూఏఎన్‌ నంబర్‌ను ఏమి చేయాలి?

PF Account: కంపెనీ మారారా? పీఎఫ్ ఖాతా మార్చుకోవడం ఎలా? ఇలా చేయండి..
Epfo
Madhu
|

Updated on: Feb 24, 2024 | 9:22 AM

Share

ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత చాలా అవసరం. వయసులో ఉన్నప్పుడు కష్టబడి సంపాదిస్తూ చీకూచింతా లేకుండా జీవిస్తాం. కానీ వృద్ధాప్యం వచ్చాక పరిస్థితి ఏమిటి. అప్పుడు ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. అందుకే కష్టబడే సమయంలో పొదుపు చేస్తే చివరి దశలో ఆదుకుంటాయి. సాధారణంగా మనం ఒక సంస్థలో, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసినప్పుడు ఆ యజమాని మనకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ప్రారంభిస్తారు. ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను కేటాయిస్తారు. ప్రతి నెలా మనకు వచ్చే జీతంలో కొంత భాగం దానికి జమచేస్తారు. అలాగే సంస్థ యాజమాన్యం కూడా తన వాటాగా కొంత కలుపుతుంది. కొంచెం కొంచెం జమ చేసిన మెత్తం ఉద్యోగ విరమణ సమయంలో ఒక్కసారిగా అందిస్తారు. ఆ సొమ్ము వృద్ధాప్యంలో అవసరాలకు పనికి వస్తుంది.

సంస్థ మారితే..

సాధారణంగా ఒక సంస్థలో పనిచేసిన ఉద్యోగి కొన్నాళ్ల తర్వాత వేరే సంస్థకు మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వృద్ధి కోసం, ఎక్కువ వేతనం వచ్చే అవకాశం ఉన్నపుడు ఈ నిర్ణయం తీసుకుంటారు. నూతన సంస్థలో చేరినప్పుడు కొత్త యజమాని కూడా ఆ ఉద్యోగికి ఈపీఎఫ్ ఖాతా తెరుస్తారు. మళ్లీ యూఏఎన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇక్కడే ఒక సమస్య ఏర్పడుతుంది. ముందు సంస్థలో కేటాయించిన యూఏఎన్‌ నంబర్‌ను ఏమి చేయాలి? పాత ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న సొమ్ముల పరిస్థితి ఏమిటనే సందేహం కలుగుతుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం.

యూఏఎన్‌ నంబర్‌ అంటే..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులు అందరికీ 12 అంకెల ప్రత్యేక నంబర్ ను కేటాయిస్తుంది. దానినే యూఏఎన్ నంబర్ అంటారు. మీరు ఉద్యోగ రీత్యా వివిధ కంపెనీలకు మారినప్పటికీ ఈ యూఏఎన్ నంబర్ స్థిరంగా ఉంటుంది. ఈ నంబర్ కు ఈపీఎఫ్ ఖాతాను కలపడం వల్ల ఆర్థికంగా నష్టం పోకుండా చూసుకోవచ్చు. ఈపీఎఫ్‌ ఖాతాలన్నీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఒక ఉద్యోగికి వివిధ కారణాల వల్ల నూతన సంస్థ కొత్త యూఏఎన్ నంబర్ ను కేటాయించవచ్చు. అతడు తన నంబర్ ఐడీ, యూఏఎన్ నంబర్ ఇవ్వనప్పుడు మాత్రమే కొత్త సంస్థలో ఈపీఎఫ్ ఖాతా యూఏఎన్ నంబర్ ను కేటాయిస్తారు. అదే సమ యంలో పాత యజమాని ఆ ఉద్యోగి చివరి పనిరోజును ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్ (ఈసీఆర్)లో నమోదు చేయకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

విలీనం చేసుకుంటే ఎంతో మేలు..

ఒక ఉద్యోగి తన యూఏఎన్ నంబర్ లో తన వివిధ ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా వివిధ కంపెనీలకు మారినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కొత్త సంస్థలో చేరినప్పుడు ఈపీఎఫ్ ఖాతా తెరిచిన వెంటనే తన పాత యూఏఎన్ నంబర్ చెప్పాలి. అప్పుడే పాత ఖాతా నుంచి సొమ్ములు సులభంగా బదిలీ అవుతాయి. ఒక్కోసారి నూతన సంస్థ కొత్త ఈపీఎఫ్ ఖాతాతో పాటు కొత్త యూఏఎన్ నంబర్ ను కేటాయిస్తుంది. అలాంటప్పుడు పాత యూఏఎన్ నంబర్‌ను దానిలో విలీనం చేసుకోవాలి.

యూఏఎన్ నంబర్లను విలీనం చేసుకునే విధానం..

  • ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  • అక్కడ హోమ్ పేజీలో వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ దగ్గర కనిపించిన ఆన్ లైన్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి.
  • మీ వ్యక్తిగత ఖాతా వివరాలన్నీకనిపిస్తాయి. అలాగే మీ కొత్త ఈపీఎఫ్ ఖాతా నంబర్ ను చూసుకోవచ్చు. మీరు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలనుకునే పాత ఖాతాలూ కనిపిస్తాయి.
  • మీ మునుపటి లేదా ప్రస్తుత ఖాతాలను బదిలీ చేసుకోవాలంటే వాటిని పాత లేదా ప్రస్తుత యజమాని ధ్రువీకరించాలి.
  • బదిలీ ప్రక్రియ వేగవంతంగా జరగడానికి ప్రస్తుత యజమానితో ధ్రువీకరణ చేసుకోవాలి.
  • అలాగే మీ మునుపటి ఈపీఎఫ్ నంబర్, యూఏఎన్ నంబర్ను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ డిటైల్ బటన్ నొక్కాలి. వెంటనే మీ మందు ఖాతా వివరాలన్నీ కనిపిస్తాయి.
  • అనంతరం గెట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మెబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. వెంటనే ఆ నంబర్ ను ఎంటర్ చేసి సబ్ మిట్ బటన్ నొక్కాలి.
  • దీంతో మీ ఈపీఎఫ్ ఖాతా కలిపేందుకు చేసిన రిక్వెస్ట్ విజయవంతమవుతుంది. ఇప్పుడు మీ రిక్వెస్ట్ ను మీ కొత్త యజమాని ధ్రువీకరించాలి. ఆయన ఆ పని చేసిన వెంటనే మీ ఖాతాల బదిలీ పూర్తవుతుంది. మెర్జర్‌ స్టేటస్లో ఆ వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..