ATM Withdrawal Charges: అక్కడ ఏటీఎం వాడితే బాదుడే బాదుడు.. ప్రయాణికులు అలర్ట్‌గా ఉండాల్సిందే..
భారతీయ పర్యాటకుల నుంచి కొన్ని దేశాల అత్యధిక ఏటీఎం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆసియా- పసిఫిక్ (ఏపీఏసీ) రీజియన్ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఇచ్చిన నివేదిక ప్రకారం తుర్కియే (టర్కీ)లో ఏటీఎం చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశంలో దాదాపు 4.44% సొమ్మును ట్రాన్‌సెక‌్షన్ చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త సంవత్సరం మొదలైంది.

విదేశాల్లో విహారయాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? కుటుంబంతో సహా ఇతర దేశాల్లో పర్యటించాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం తప్పనిసరిగా చదవాల్సిందే. ఎందుకంటే సాధారణంగా మనం వేరే దేశాలకు పర్యటనకు వెళ్లే ముందు అక్కడి హోటళ్లు, రవాణా సౌకర్యాలు, భోజనం వంటి వాటిని తెలుసుకుంటాం. ఎలా వెళ్లాలి? ఖర్చులు అన్ని లెక్క చూసుకుంటాం. అదే సమయంలో మరో ముఖ్యమైన అంశం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఏటీఎం చార్జీలు. ఎందుకంటే చాలా దేశాల్లో ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విహారయాత్రల్లో డబ్బులు నష్టపోకుండా ఉండాలంటే దీని గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఈ దేశాల్లో అధిక చార్జీలు..
ఫారిన్ ఎక్సేంజ్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ ఇటీవల వెల్లడించిన విషయం ప్రకారం భారతీయ పర్యాటకుల నుంచి కొన్ని దేశాల అత్యధిక ఏటీఎం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆసియా- పసిఫిక్ (ఏపీఏసీ) రీజియన్ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఇచ్చిన నివేదిక ప్రకారం తుర్కియే (టర్కీ)లో ఏటీఎం చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశంలో దాదాపు 4.44% సొమ్మును ట్రాన్‌సెక‌్షన్ చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త సంవత్సరం మొదలైంది. చాలామంది భారీతీయులు అంతర్జాతీయ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారందరూ ఏటీఎం చార్జీల వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిపాటి అవగాహనతో సులభమైన, తక్కువ బడ్జెట్‌తో టూర్ ప్లాన్ వేసుకోవచ్చు.
ఏపీఏసీ పరిధిలోని సుమారు 15 దేశాల్లో భారతీయుల నుంచి ఏటీఎం చార్జీలను ఎంత వసూలు చేస్తారో తెలుసుకుందాం. తుర్కియేలో 4.44, బూటాన్‌లో 3.16, నేపాల్‌లో 2.79, థాయిలాండ్‌లో 2.02, దక్షిణ కొరియాలో 2.55, వియత్నాంలో 1.85, సింగపూర్‌లో 1.41, జపాన్‌లో 0.64, శ్రీలంకలో 0.57. బంగ్లాదేశ్‌లో 0.46, ఇండోనేషియాలో 0.30, హాంకాంగ్‌ల 0.05, మలేసియాలో 0.03, చైనా మెయిన్‌లాండ్ 0.01 శాతంగా ఈ చార్జీలు ఉన్నాయి. ఉదాహరణకు మనం తుర్కియే వెళ్లినప్పుడు ఆదేశంలోని ఏటీఎంలలో రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే వారు వసూలు చేసే చార్జీలు రూ.3,108 ఉంటాయి. అదే మలేసియాలో ఆ కేవలం రూ.21 మాత్రమే ఉంటాయి.
వివిధ దేశాల్లో కరెన్సీ లావాదేవీలు చేసేటప్పుడు అక్కడ వసూలు చేసే చార్జీల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనకు తెలియని, బయటకు చెప్పని కొన్ని ట్యాక్స్‌లు అందులో ఉంటాయి. ఈ చిన్నిచిన్న ట్యాక్స్‌లన్నీ కలిపి ఎక్కువ మొత్తంలా మారతాయి. అందుకే పర్యాటకులు అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో చార్జీల గురించి తెలుసుకోవాలి. డబ్బును వేరే కరెన్సీలోకి మార్చినా, పంపించినా ఇవి వర్తిస్తాయి. ఏటీఎంల నుంచి డ్రా చేసినా సరే చెల్లించాల్సిందే.
పర్యాటకులు పాటించాల్సిన జాగ్రత్తలు..
- డబ్బును ఎక్కడ విత్‌డ్రా చేయాలో పరిశోధించాలి. ప్రయాణానికి ముందే చెక్ చేసుకోవాలి.
- విదేశాల్లో లావాదేవాలు నడిపేటప్పుడు వివిధ ప్రదేశాల్లో ఏటీఎం చార్జీలను తెలుసుకోవాలి.
- అంతర్జాతీయ విత్‌డ్రాకు సంబంధించి మీ కార్డు నుంచి వసులు చేసే ఫీజులను నిర్ధారించుకోవాలి.
- కొందరు ప్రొవైడర్లు నిర్ధిష్ట ప్రాంతాల్లో ఉచిత విత్‌డ్రాలు అందిస్తారు.
- స్టోర్లలో మీ కార్డులను స్వైప్ చేసేటప్పుడు చార్జీలను అక్కడి కరెన్సీలో చెల్లించాలి. తద్వారా డైనమిక్ కరెన్సీ చార్జీల నుంచి తప్పించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




