Best Triple Door Refrigerators: ఎక్కువ స్థలం.. మరింత చల్లదనం.. మార్కెట్లో బెస్ట్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఇవే..
మీది పెద్ద కుటుంటం అయితే సింగిల్ డోర్ కెపాసిటీ సరిపోదు. డబుల్ డోర్ అయితే ఓకే.. కానీ అది కూడా కొన్ని కుటుంబాలకు చాలదు. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మరో ఆప్షన్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇందులో అధిక స్పేస్ తో పాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

వేసవిలో నీటి వాడకం ఎక్కువ. అది కూడా చల్లని నీరు కావాలని అందరూ అనుకుంటారు. అలాగే ఆహార పదార్థాలు పాడవకుండా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ రిఫ్రిజిరేటర్ తమ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్, ఫ్రెంచ్ డోర్ వంటి అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబం పెద్ద కుటుంటం అయితే సింగిల్ డోర్ కెపాసిటీ సరిపోదు. డబుల్ డోర్ అయితే ఓకే కానీ అది కూడా కొన్ని కుటుంబాలకు చాలదు. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మరో ఆప్షన్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇందులో అధిక స్పేస్ తో పాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్రిజ్‌లు చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా తక్కువ విద్యుత్తును ఖర్చు చేస్తాయి. ఈ నేపథ్యంతో మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిలోని ఫీచర్లు, ధర, డిజైన్ వంటి పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.
బోస్చ్ మ్యాక్స్ ఫ్లెక్స్ కన్వర్ట్ 332 లీటర్ల ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. మీరు భారతదేశంలోని అత్యుత్తమ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లలో ఒకదానిని కోరుకుంటున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా ఫ్రిడ్జ్ లోపల షెల్ఫ్ లను అమర్చుకోవచ్చు. గ్లాస్ షెల్ఫ్ ల ఎత్తును పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. దీని కోసం టఫ్ ఎండ్ గ్లాస్ ని దీనిలో వినియోగించారు. ఇది 180 కేజీల వరకూ బరువును మోయగలుగుతుంది. ఫ్రిడ్జ్ లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత స్థిరంగా మెయింటేన్ అవుతుంది. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ. 39,600గా ఉంది.
వర్ల్‌పూల్ 240 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఈ వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్ కూడా మంచి ఎంపిక. రెండు రెట్ల అదనపు తాజాదనం కోసం సిక్త్ సెన్స్ యాక్టివ్‌ఫ్రెష్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. వర్ల్‌పూల్ ప్రోటాన్ వరల్డ్ సిరీస్ రిఫ్రిజిరేటర్‌లు భారతదేశం యొక్క ప్రత్యేకమైన యాక్టివ్ ఫ్రెష్ జోన్‌ను కలిగి ఉన్నాయి. 3-డోర్ ఫార్మాట్‌లో 32 లీటర్ల వరకు నిల్వ స్థలం, మెరుగైన కూలింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎక్కువ గంటలు దీనిలో పెట్టిన ఆహారం తాజాగా ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ. 28499గా ఉంది.
బోస్చ్ మ్యాక్స్ ఫ్లెక్స్ 364 లీటర్ల ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఇది వినియోగదారులకు అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది. ఇది విద్యుత్తు అంతరాయం సమయంలో 0°C కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ సేపు లోపల ఉండేలా చూస్తుంది. దీనిలో ఉష్ణోగ్రతను మరింత తగ్గించడానికి సూపర్ ఫ్రీజింగ్‌ని యాక్టివేట్ చేయవచ్చు. ఇది స్టెబిలైజర్ లేకుండానే పనిచేస్తుంది. 100 నుంచి 300వోల్ట్ ల మధ్య పనిచేస్తుంది. దీని ధర రూ. 45,500.
వర్ల్‌పూల్ 260 లీటర్ల ఫ్రాస్ట్-ఫ్రీ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్.. సిక్త్ సెన్స్ యాక్టివ్ ఫ్రెష్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్ రెండు రెట్లు అధిక తాజాదనాన్ని అందిస్తుంది. ఇది దేశంలోని మొదటి బాటమ్ డ్రాయర్ కలిగి ఉన్న రిఫ్రిజిరేటర్. ప్రత్యేకంగా పండ్లు, కూరగాయలు పెట్టుకోవచ్చు. దీనిలోని జియోలైట్ టెక్నాలజీ పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండకుండా నిరోదిస్తుంది. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. మైక్రో బ్లాక్ 99 శాతం వరకు బ్యాక్టీరియా అభివృద్ధిని నిరోధిస్తుంది. దీని ప్రత్యేక చిల్లింగ్ సిస్టమ్, అత్యాధునిక ఉష్ణోగ్రత నియంత్రణ నాబ్, చిల్లర్‌లో ఉంచిన అనేక రుచికరమైన పదార్ధాల ఉష్ణోగ్రతను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ. 27,490గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







