Honda e:Ny1: హోండా నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్ పై 412 కిమీ.. పూర్తి వివరాలు ఇవి..
హోండా ఈ:ఎన్ వై1 కారులో 68.8kwh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 412 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. త్రీ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ పవర్ డ్రైవ్ యూనిట్ వస్తుంది.10శాతం నుంచి 80శాతం వరకూ చార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ విప్లవం మొదలైంది. పెద్ద ఎత్తున కార్లు, బైక్ లు ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో హోండా కంపెనీ తన రెండో ఎలక్ట్రిక్ కారును ఎస్‌యూవీ మోడల్లో లాంచ్ చేసింది. దాని పేరు హోండా ఈ:ఎన్ వై1(Honda e:Ny1) ఇటీవల జరిగిన యూరోపియన్ మీడియా ఈవెంట్లో దీనిని ఆవిష్కరించింది. దీనిలో పవర్ ట్రైన్ 201బీహెచ్పీ, 310ఎన్ఎం. అలాగే సింగిల్ చార్జ్ పై ఏకంగా 412 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డిజైన్ ఇలా..
ఈ కొత్త ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ఉన్న హోండా హెచ్ఆర్వీ మోడల్లోనే ఉంటుంది. ఈ హోండా హెచ్ఆర్వీని గతేడాది చైనాలో హోండా లాంచ్ చేసింది. అయితే ప్రస్తుత ట్రెండ్ అనుగుణంగా పలు మార్పులు కొత్త మోడల్లో చేసింది. ట్రేడిషినల్ గ్రిల్ స్థానంలో పూర్తి మూసివేసిన ప్యానల్ ను ఏర్పాటు చేసింది. ఎయిర్ వెంట్ బాగా కిందికి దిగింది. ఎందుకంటే పవర్ ట్రైయిన్ కి వెంటిలేషన్ అందేటట్లు బంపర్ కన్నా కిందకే ఎయిర్ వెంట్ ఇచ్చారు. కారు లోపల అధికంగా స్పేస్ ఉండేటట్లు జాగ్రత్త తీసుకున్నారు. మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మధ్య సీట్లకు సింపుల్ లే అవుట్ ఇచ్చారు. సులభంగా వినియోగించే బటన్స్ ఉంటాయి. వైర్ లెస్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. 15.1 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇతర డ్రైవింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం..
హోండా ఈ:ఎన్ వై1 కారులో 68.8kwh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 412 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. త్రీ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ పవర్ డ్రైవ్ యూనిట్ వస్తుంది. దీనిలో ఎలక్ట్రిక్ యూనిట్, ఎలక్ట్రిక్ మోటార్, గేర్ బాక్స్ ఉంటాయి. ఇది గరిష్టంగా 201బీహెచ్పీ, 310ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డీసీ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. 10శాతం నుంచి 80శాతం వరకూ చార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీనిలోని ఛాసిస్ అత్యంత ధృడమైన హై టెన్సైల్ స్టీల్ తో తయారు చేశారు. ఇది కారు మొత్తం బాడీ వెయిట్ లో 47శాతం బరువు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..