AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? ఇవిగో బెస్ట్ ఆప్షన్లు.. అనువైన ధరలోనే..

ఇటీవల కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది. తక్కువ ధరలో కారు కావాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. మన భారతదేశంలో ఈ సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రూ. 10లక్షల లోపు బడ్జెట్ వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.

Best Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? ఇవిగో బెస్ట్ ఆప్షన్లు.. అనువైన ధరలోనే..
Car Loan
Madhu
|

Updated on: Mar 09, 2024 | 8:23 PM

Share

ఇటీవల కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది. తక్కువ ధరలో కారు కావాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. మన భారతదేశంలో ఈ సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రూ. 10లక్షల లోపు బడ్జెట్ వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ఈ బడ్జెట్లోని వారు కొత్త కార్ల కన్నా కూడా యూసెడ్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో చాలా మోడళ్లు కార్లు అందుబాటులో ఉంటాయి. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొనే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అవగాహన లేకపోయినా కుచ్చుటోపీ తప్పదు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్లలో రూ. 10లక్షలోపు బడ్జెట్లో బెస్ట్ కార్లు ఏవి? రండి ఈ కథనం చదవండి..

హ్యూందాయ్ క్రెటా..

మన దేశంలో ఎక్కువ ఉపయోగించే కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఈ హ్యూందాయ్ క్రెటా కూడా ఒకటి. ఫస్ట్ జనరేషన్ క్రెటా కారులో 1.6లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.4లీటర్ డీజిల్ లేదా 1.6లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్లు ఉన్నాయి. 1.6లీటర్ క్రెటా, డీజిల్ లేదా పెట్రోల్ వేరియంట్ ను సెకండ్ హ్యాండ్ లో రూ. 8లక్షలకు కొనుగోలు చేయొచ్చు.

హోండా సిటీ నాలుగో జనరేషన్..

ఈ కారులో 1.5 లీటర్ ఐ-వీటెక్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ, 1.5లీటర్ డీజిల్ ఇంజిన్ తో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ నాలుగో జనరేషన్ కారును మీరు కేవలం రూ. 6లక్షలకే కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ ఎస్- క్రాస్..

ఈ కారుకు కూడా మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది. 1.3 లీటర్ డీజిల్, 1.6లీటర్ డీజిల్, 1.5లీటర్ ఎన్ఏ పెట్రోల్ కే సిరీస్ ఇంజిన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని మీరు రూ. 10లక్షలకు కొనుగోలు చేయొచ్చు.

టోయోటా ఫార్చునర్..

టోయోటా ఫార్చునర్ అనేది మన దేశీయ మార్కెట్లో లెజండరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తాయి. ఈ ఫార్చునర్ కారు అధిక మైలజీ ఇచ్చే కార్లతో ఇది ఒకటి. ఈ ఫార్చునర్ కారు సెకండ్ హ్యాండ్ లో ధర రూ. 10లక్షలలోపే కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..