Credit Card: అత్యధిక క్యాష్ బ్యాక్ అందించే క్రెడిట్ కార్డులు ఇవే.. బెస్ట్ కార్డ్స్.. బెస్ట్ ఆఫర్స్..
ప్రతి రోజూ మీరు క్రెడిట్ కార్డులు వినియోగించడం ద్వారా పలు క్యాష్ బ్యాక్ లు పొందుకుంటూ అధికంగా మీ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ క్రెడిట్ కార్డుతో ఆన్ లైన్ షాపింగ్ చేయాలి? ఏ క్రెడిట్ కార్డుతో రోజూ వారి ఖర్చులు కొనుగోలు చేయాలి? ఎక్కడ ఎలా వాడితే రివార్డులు, క్యాష్ బ్యాక్ వస్తాయో వినియోగదారులకు అవగాహన ఉండటం ముఖ్యం.
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అందులో వస్తున్న రివార్డులు, క్యాష్ బ్యాక్ లతో అందరూ వీటిని కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ద్వారా షాపింగ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు వినియోగించే వారు ఓ క్రమ పద్ధతిలో వినియోగించుకుంటూ.. సమయానికి ఆ బిల్లులు కడుతూ ఉంటేనే అధిక ప్రయోజనం పొందే వీలుంటుంది. ప్రతి రోజూ మీరు క్రెడిట్ కార్డులు వినియోగించడం ద్వారా పలు క్యాష్ బ్యాక్ లు పొందుకుంటూ అధికంగా మీ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ క్రెడిట్ కార్డుతో ఆన్ లైన్ షాపింగ్ చేయాలి? ఏ క్రెడిట్ కార్డుతో రోజూ వారి ఖర్చులు కొనుగోలు చేయాలి? ఎక్కడ ఎలా వాడితే రివార్డులు, క్యాష్ బ్యాక్ వస్తాయో వినియోగదారులకు అవగాహన ఉండటం ముఖ్యం. అలా తెలివిగా ఉపయోగిస్తేనే క్రెడిట్ కార్డుల నుంచి అధిక ప్రయోజనాలు అందుకునే అవకాశాలుంటాయి.
అన్ని కార్డులపై క్యాష్ బ్యాక్ ఉండదు..
అన్ని క్యాష్‌బ్యాక్ కార్డ్‌లు ఒకేలా ఉండవు. కొందరు మీరు కొనుగోలు చేసే ప్రతిదానిపై తిరిగి కొంత శాతాన్ని అందిస్తారు. మరికొందరు కొన్ని రకాల కొనుగోళ్లపై ఎక్కువ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. సరైన క్రెడిట్ కార్డ్‌తో, మీరు కిరాణా సామగ్రి లేదా ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటి ద్వారా మీరు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులపై తిరిగి డబ్బు సంపాదించవచ్చు. ఈక్రమంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ కార్డులను ఎంపిక చేసుకోవాలి. అలాంటి కొన్ని కార్డులను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ కార్డులపై చార్జీలు, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్.. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ. 999 ఉంటుంది. ఈ కార్డు ద్వారా చేసే అన్ని ఆన్‌లైన్ ఖర్చులపై 5 శాతం క్యాష్‌బ్యాక్, అన్ని ఆఫ్‌లైన్ ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందుకోవచ్చు.
యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ. 499 గా ఉంటుంది. ఈ కార్డుతో గూగుల్ పే ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే స్విగ్గీ, జోమాటో, ఓలా వంటి వాటిపై 4శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డు జాయినింగ్, యాన్యువల్, రెన్యువల్ చార్జీ అన్ని కలిపి రూ. 500 ఉంటుంది. ఈ కార్డు ద్వారా మీరు ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేస్తే 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందుకోవచ్చు. స్విగ్గీ, పీవీఆర్ వంటి మొదలైన భాగస్వామి వ్యాపారుల వద్ద షాపింగ్ చేస్తే 4 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
అమోజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు.. ఈ కార్డుకు జాయినింగ్ ఫీజు, యాన్యువల్ చార్జీలు ఏమి ఉండవు. పూర్తి ఉచితం. ఈ కార్డు ఉపయోగించి అమెజాన్లో షాపింగ్ చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, అన్ని ఆఫ్‌లైన్ ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
హెచ్డీఎఫ్సీ మిలీనియా క్రెడిట్ కార్డ్.. ఈ కార్డుపై జాయినింగ్ ఫీజు, వార్షిక/పునరుద్ధరణ రుసుము రూ. 1000 ఉంటుంది. ప్రధాన ఆన్‌లైన్ బ్రాండ్ ఖర్చులపై 5 శాతం క్యాష్ బ్యాక్, ఇతర ఖర్చులపై 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డుపై జాయినింగ్ ఫీజు, వార్షిక/పునరుద్ధరణ రుసుము ఒక్కొక్కటి రూ. 500గా ఉంటుంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో లావాదేవీలపై 25 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
స్టాండర్డ్ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డుపై జాయినింగ్ ఫీజు, వార్షిక/పునరుద్ధరణ రుసుము ఒక్కొక్కటి రూ. 499గా ఉంటుంది. ఈ కార్డు ద్వారా చేసే ఆన్‌లైన్ ఖర్చుపై 2X క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై నెలకు 0.99 శాతం తక్కువ వడ్డీ లభిస్తోంది.
స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డుపై జాయినింగ్ ఫీజు, వార్షిక/పునరుద్ధరణ రుసుము ఒక్కొక్కటి రూ. 500గా ఉంది. స్విగ్గీ ఫుడ్ ఆర్డర్‌లు, ఇన్‌స్టామార్ట్, డైనౌట్ అండ్ జెనీపై 10 శాతం క్యాష్‌బ్యాక్, ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..