Best 160CC Bikes: కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ 160 సీసీ బైక్‌లపై ఓ లుక్కేయండి..
కొత్తేడాది కొత్త బైక్ కొనుగోలు చేయాలని చాల మంది భావిస్తుంటారు. ఇందులో భాగంగానే బైక్ ఫీచర్లు, ధర వివరాల కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంటారు. మీరు కూడా కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని 160 సీసీ బైక్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
కొత్తేడాది కొత్త బైక్ కొనుగోలు చేయాలని చాల మంది భావిస్తుంటారు. ఇందులో భాగంగానే బైక్ ఫీచర్లు, ధర వివరాల కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంటారు. మీరు కూడా కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని 160 సీసీ బైక్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో 160 సీసీకి ప్రాధాన్యత పెరుగుతోంది. స్పీడ్‌తో పాటు మైలేజ్ ఇచ్చే ఇలాంటి కొన్ని బెస్ట్ బైక్స్‌పై ఓ లుక్కేయండి..
TVS Apache RTR 160: టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ బైక్ భారీగా విక్రయాలు జరుపుకుంది. పవర్ ఫుల్ లుక్‌తో తీసుకొచ్చిన ఈ బైక్‌లో 159.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పీఎమ్ వద్ద 15.8 హెచ్‌పీ పవర్‌ను, 6000 ఆర్‌పీఎమ్ వద్ద 13ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే రూ. 1,17,790 నుంచి 1,24,590 ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
Pulsar NS 160: బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్‌కి భారత మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యూత్‌లో ఈ బైక్ మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్‌కు160.3సీసీ ఆయిల్ కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్ DTS-i ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 rpm వద్ద 15.5PS పవర్‌ను, 6500 rpm వద్ద 14.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర విషయానికొస్తే.. ప్రారంభ ధర రూ. 1,25,114 ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి వచ్చిన ఈ కొత్త బైక్‌లో 159.7cc సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 16.8hp పవర్, 14.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించారు. ధర విషయానికొస్తే, ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ₹1,39,690గా ఉంది.
Hero Xtreme 160R: భారీ అమ్మకాలతో ఈ బైక్ దూసుకుపోతోంది. ఈ బైక్‌లో 163సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 15bhp, 14Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, ఈ బైక్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,17,786 వద్ద ప్రారంభమవుతుంది.
KTM 1290 సూపర్ అడ్వెంచర్ S: కేటీఎమ్‌కు చెందిన 1290 సూపర్ అడ్వెంచర్ S 2023 వేరియంట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. రైడింగ్‌కు పొజిషన్‌కు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ బైక్ నడుపుతున్న వ్యక్తికి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి పొందుతారు. ఈ బైక్‌లో 1301cc V-ట్విన్ ఇంజిన్‌తో పాటు రాడార్-ఆధారిత సర్దుబాటు చేయగల క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..