AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Theft Alarm: కేవలం వెయ్యి రూపాయలతో మీ బైక్‌ దొంగల నుంచి సేఫ్‌.. రిమోట్‌ కంట్రోల్‌తో అంతా..

ప్రస్తుత రోజుల్లో బైక్‌ పార్కింగ్‌ చాలా మందికి పెద్ద సమస్యగా మారుతోంది. ఇంట్లో సరిపడ స్థలం లేకపోవడంతో ఇంటికి దూరంగా ఎక్కడో పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బైక్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగలించిన..

Anti-Theft Alarm: కేవలం వెయ్యి రూపాయలతో మీ బైక్‌ దొంగల నుంచి సేఫ్‌.. రిమోట్‌ కంట్రోల్‌తో అంతా..
Anti Theft Alarm
Narender Vaitla
|

Updated on: Dec 29, 2022 | 9:10 AM

Share

ప్రస్తుత రోజుల్లో బైక్‌ పార్కింగ్‌ చాలా మందికి పెద్ద సమస్యగా మారుతోంది. ఇంట్లో సరిపడ స్థలం లేకపోవడంతో ఇంటికి దూరంగా ఎక్కడో పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బైక్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగలించిన సంఘటనలు ఎప్పుడో అప్పుడు వినే ఉంటాం. మరి కార్ల మాదిరిగానే బైక్‌లకు అలారం సిస్టం ఉంటే ఎలా ఉంటుంది.? ఎవరైనా బైక్‌ను ముట్టుకోగానే అలర్ట్‌ చేసే సిస్టమ్‌ ఉంటే భలే ఉంటుంది కదూ.! బైక్‌లో కారులాంటి సిస్టమ్‌ ఎలా ఉంటుందనేగా మీ సందేహం. అయితే ఇందు కోసం మార్కెట్లో ఒక మంచి ప్రొడక్ట్ ఉంది. అదే యాంటీ థెఫ్ట్‌ అలారమ్‌ సిస్టమ్‌. దీని ద్వారా మీ బైక్‌ దొంగల నుంచి సురక్షితంగా ఉంటుంది.

ఈ అలారం సెక్యూరిటీ గ్యాడ్జెట్‌ బైక్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాడ్జెట్‌తో పాటు అలారం సిస్టమ్‌, బజర్‌, రిమోట్‌ లభిస్తాయి. దీనిని బైక్‌ సీటును ఓపెన్‌ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బైక్‌ రిపేర్‌ షాప్స్‌లో లేదా, సొంతంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత బైక్‌ను రిమోట్‌తో ఆపరేట్‌ చేసుకోవచ్చు. రిమోట్‌పై స్టార్ట్‌ బటన్‌ను రెండు సార్లు క్లిక్‌ చేస్తే బైక్‌ కీ అవసరం లేకుండానే స్టార్ట్ అవుతుంది. అలాగే బైక్‌ను లాక్‌ చేస్తే ఎవరైనా బైక్‌పై చేయి వేస్తే చాలు పెద్దగా అలారం వస్తుంది.

దీని బజర్‌ ఏకంగా 100 డీబీతో మోగుతుంది. చాలా దూరం వరకు ఈ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో ఎవరైనా బైక్‌ను టచ్‌ చేస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది. రిమోట్‌తో మళ్లీ ఆఫ్‌ చేసే వరకు మోగుతూనే ఉంటుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ యాంటీ థెఫ్ట్‌ అలారంలు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే కంపెనీ బట్టి రూ. 1000 నుంచి రూ. 1500లో ఈ గ్యాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..