ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకుంటే డేంజర్‌లో పడ్డట్లే.. సింపుల్ టిప్స్‌తో సేఫ్ జోన్‌లోకి..
Google, Apple ఆపరేటింగ్ సిస్టమ్‌లు ప్రపంచవ్యాప్తంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అనేక బ్రాండ్‌ల ఫోన్‌లలో ఈ రెండు రకాల ఓఎస్‌లే కనిపిస్తుంటాయి. అయితే, రెండు ప్లాట్‌ఫారమ్‌లు యూజర్ డేటాను సేకరిస్తుంటాయి.
Personal Data: స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే, ప్రపంచంలో రెండు రకాల పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. Google సంస్థకు చెందిన Androidతోపాటు Apple కంపెనీ నుంచి iOS ఆపరేటింగ్ సిస్టం అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫారమ్‌లలో కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. అయితే, ఈ సేవలను ఉపయోగించడానికి, యూజర్లు అనేక అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు మన డేటాను చాలా వరకు సేకరిస్తాయనడంలో సందేహం లేదు.
సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే, గూగుల్, ఆపిల్ కూడా మన గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తుంటాయి. యూజర్ల ప్రొఫైల్స్‌ను ప్రత్యేకంగా సేవ్ చేస్తుంటారు. అందులో మన వివరాలు చాలా వరకు నిల్వ చేస్తుంటారు. ఈ కంపెనీలకు యూజర్ల గురించి ఎంతవరకు తెలుసో ఓ లుక్ వేద్దాం..
Apple ఎంత వరకు సేకరిస్తోంది..
ఆపిల్ ఎల్లప్పుడూ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది. థర్డ్ పార్టీ అడ్వర్టైజర్‌లకు కంపెనీ యూజర్ డేటాను అతి తక్కువ బహిర్గతం చేస్తుంది. కంపెనీ కొంత కాలం క్రితం యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ ఫీచర్‌ను జోడించింది. ఇది వినియోగదారులకు వారి డేటాపై అదనపు నియంత్రణను అందిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు తమ డేటాను ఏ యాప్‌లు యాక్సెస్ చేయవచ్చో, ఏది యాక్సెస్ చేయకూడదో నిర్ణయించుకోవచ్చు.
అయితే, ఈ ఫీచర్ తర్వాత కూడా, ఆపిల్ స్వయంగా చాలా యూజర్ డేటాను సేకరిస్తుంది. కంపెనీ వినియోగదారుల Apple ID వివరాలు, ఫోటోలు, ఇమెయిల్‌లలో నిల్వ చేసిన డేటా, App Store నుంచి కొనుగోళ్లకు సంబంధించిన డేటాను యాక్సెస్ చేస్తుంది. మీరు కోరుకుంటే, మీరు మీ వ్యక్తిగత డేటా కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం మీరు privacy.apple.com కి వెళ్లాలి. ఆపిల్ ఖాతాతో లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మీ డేటా కాపీని అభ్యర్థించాలి. ఆ తర్వాత మీరు డేటాను కోరుకునే ఎంపికలపై క్లిక్ చేయాలి. ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, ఇమెయిల్ ద్వారా మీ డేటాను పొందుతారు. వినియోగదారులు డేటాను పొందడానికి గరిష్టంగా 7 రోజులు పట్టవచ్చు.
Google వద్ద ఎంత డేటా ఉంటుంది?
గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు గూగుల్ అన్ని సేవలను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, గూగుల్ మీ డేటాను చాలా వరకు కలిగి ఉంటుంది. గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకూడదని మీరు కోరుకుంటే, దీనికి మీకు ఒకే ఒక మార్గం ఉంది. మీరు గూగుల్ సేవలను ఉపయోగించడం మానేయాలి. Googleలో అందుబాటులో ఉన్న మీ డేటాను మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం, మీరు myactivity.google.com/activitycontrols కి వెళ్లి Google ఖాతాతో సైన్-ఇన్ చేయాలి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ చూస్తారు. గూగుల్ మీ పూర్తి సెర్చింగ్ హిస్టరీ, లొకేషన్ ట్రాకింగ్, YouTube హిస్టరీ, యూజర్ ఛాయిస్ ప్రకటనల వివరాలు అందులో ఉంటాయి.
ఇక్కడ మీరు అన్ని వెబ్, యాప్ యాక్టివిటీని నిర్వహించే ఎంపికపై క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు మీ హిస్టరీని తనిఖీ చేయవచ్చు. మీకు కావాలంటే Googleలో స్టోర్ చేసిన మీ డేటాను మాన్యువల్‌గా తొలగించవచ్చు. అలాగే YouTube డేటా, లొకేషన్ హిస్టరీని కూడా తొలగించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..