వ్యోమగాములు అంతరిక్షంలో నీటిని ఎలా తాగుతారు?
Balaraju Goud
21 March 2025
అంతరిక్షం సున్నా గురుత్వాకర్షణ శక్తికి చేరుకున్న తర్వాత, మానవుని జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. చివరికి తినటం, త్రాగటం కూడా.
అటువంటి పరిస్థితిలో, మనం అంతరిక్షంలో నీరు త్రాగగలమా లేదా అనేది ప్రశ్న. సమాధానం అవును, కానీ భూమిపై మానవులు త్రాగే విధంగా కాదు.
అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ప్రత్యేకంగా వ్యోమగాములు నీరు త్రాగడానికి ఒక ప్రత్యేక కప్పును రూపొందించింది.
కాపిల్లరీ కప్‌ను నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ రూపొందించారు. అంతరిక్షంలో కూడా నీరు త్రాగడాన్ని సులభతరం చేశారు.
వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నీరు త్రాగవచ్చు. వారి మూత్రం, చెమట కూడా రీసైకిల్ అవుతుంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, మూత్రం, చెమట వంటి వ్యర్థ ద్రవాలను తాగునీటిని ఉత్పత్తి చేయడానికి రీసైకిల్ చేస్తారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వ్యోమగాములు కోసం నీటిని రీసైకిల్ చేయడానికి నీటి పునరుద్ధరణ వ్యవస్థను ఉపయోగిస్తుంది.
ఇలా చేయడం వ్యోమగాములకు తాగటానికి తగినంత నీరు లభిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు. పరిశోధన సాఫీగా జరుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శోభనం ఖర్చులు భరించే దేశం ఏదో తెలుసా..!
12వ తరగతి తర్వాత AI ఎలా చేయాలి?
మారిన ఫాస్టాగ్ రూల్స్ గమనించారా?