మత్తు కోసం నిషారాయుళ్ల ..కొత్త మార్గాల అన్వేషణ
ఏపీ సర్కార్ గంజాయిని కట్టడి చేయడంతో.. మత్తుకోసం కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు. ఇదే క్రమంలో బాపట్లలో మత్తు కోసం పెయిన్ కిల్లర్ మందులను ఇంజెక్షన్ ద్వారా ఉపయోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. జమ్ములపాలెం ఓవర్ బ్రిడ్జి మీద మత్తు మందు కలిపిన ఇంజెక్షన్లు తీసుకుంటున్నారనే సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసుల .ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.
వారికి ఆ ఇంజక్షన్లు ఎవరు విక్రయించారు ఇంకా ఎంతమంది ఉపయోగిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు మూడ్రోజుల క్రితం.. స్టువర్టుపురం గ్రామంలో మెరుపు దాడులు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి దాదాపు 16వందల మత్తు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో మత్తు కోసం కొంతమంది యువకులు ఇలా పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. వేర్వేరు కారణాలతో మెడికల్ షాపుల నుండి ట్యాబ్లెట్స్‌ను కొని వాటిని పొడిగా మారుస్తున్నారు. ఆ పొడిని ఇతర లిక్విడ్స్‌లో కలిపి ఇంజక్షన్ రూపంలో తీసుకుంటున్నారని సిఐ తెలిపారు.

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
