- Telugu News Photo Gallery Sports photos SRH Aims for 300+ Runs in IPL 2024: Head & Klassen's Bold Prediction
SRH: జస్ట్ మిస్.. కానీ కచ్చితంగా 300 కొట్టేస్తాం..! పిచ్చెక్కిస్తున్న కాటేరమ్మ కొడుకుల కాన్ఫిడెన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2024లో 300 పరుగులకు పైగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రావిస్ హెడ్ , హెన్రిక్ క్లాసెన్ ఈ లక్ష్యాన్ని సాధించగలమని నమ్ముతున్నారు. ఇప్పటికే 250 పరుగులకు పైగా మూడు సార్లు సాధించిన SRH, రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో 300 ప్లస్ స్కోర్ సాధించడం సాధ్యమని వారు భావిస్తున్నారు.
SN Pasha |
Updated on: Mar 24, 2025 | 4:25 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మూడు సార్లు 250 పైకి పైగా పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‌లో ఏకంగా 300 పరుగులు కొట్టాలనే టార్గెట్‌ను పెట్టుకుంది. ఈ విషయాన్ని ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హెన్రిక్ క్లాసెన్ వెల్లడించారు.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఈ సీజన్‌లో 300 కొడతారని ఎస్‌ఆర్‌హెచ్‌పై ఉన్న అంచనాలను తొలి మ్యాచ్‌లోనే అందుకునేంత పనిచేశారు. ఆల్‌మోస్ట్ దగ్గరికి వచ్చేసి.. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోర్ కొట్టేశారు.

2024 సీజన్‌లో బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్. ఈ స్కోర్‌ను అధిగమించడంతో పాటు అప్‌కీ బార్ 300 పార్ అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు.

ఇప్పటికే ఆర్సీబీపై 287 పరుగులు, రాజస్థాన్ రాయల్స్‌పై 286, ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల టార్గెట్‌ను పెట్టుకుంది. అందరూ కప్పులు టార్గెట్‌గా పెట్టుకుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం 300 టార్గెట్‌గా పెట్టుకుంది.

300 టార్గెట్‌పై ట్రావిస్ మాట్లాడుతూ మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది మేము కచ్చితంగా 300 పరుగులు చేరుకోవడానికి మంచి అవకాశం ఉంది. అలాగే వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ హెన్రిక్ క్లాసెన్ కూడా ఈసారి మూడు వందలకు పైగా పరుగులు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నానని చెప్పాడు. వీరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. ఈ సీజన్లోనే 300 ప్లస్ రన్స్ వచ్చేలానే ఉన్నాయి.





























