Infinix Zero 20: ఫ్లిప్ కార్ట్ లో ఇన్ ఫినిక్స్ జీరో 20…అదిరిపోయే డిజైన్ తో మతిపోగుడుతున్న ఫీచర్స్

ఈ నెల ప్రారంభంలో భారత్ మార్కెట్ లో ఇన్ ఫినిక్స్ రిలీజ్ చేసిన జీరో 20 ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ యాప్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. స్టైలిష్ డిజైన్, కొత్త 4 జీ ఎస్ఓసీ తో సేల్ లో ఉంది. ఈ ఫోన్ లో 108 ఎంపీ కెమెరాతో పాటు 60 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని కంపెనీ ప్రకటించింది.

Infinix Zero 20: ఫ్లిప్ కార్ట్ లో ఇన్ ఫినిక్స్ జీరో 20…అదిరిపోయే డిజైన్ తో మతిపోగుడుతున్న ఫీచర్స్
Infinix Zero 20
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2022 | 3:23 PM

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటాయి. భారత్ లో ఆదరణ పొందితే సేల్స్ అమాంతం పెరుగతాయని కంపెనీల భావన. అందుకు తగినట్టుగానే కొత్త కొత్త ఫీచర్స్ తో సరికొత్తగా మార్కెట్ లోకి నూతన ఫోన్స్ ను రిలీజ్ చేస్తుంటాయి. ఇదే కోవలో ఈ నెల ప్రారంభంలో భారత్ మార్కెట్ లో ఇన్ ఫినిక్స్ రిలీజ్ చేసిన జీరో 20 ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ యాప్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. స్టైలిష్ డిజైన్, కొత్త 4 జీ ఎస్ఓసీ తో సేల్ లో ఉంది. ఈ ఫోన్ లో 108 ఎంపీ కెమెరాతో పాటు 60 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ15999. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఫెడరల్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే పది శాతం ఇన్ స్టెంట్ గా తగ్గింపు లభిస్తుంది.   జీరో 20 మొబైల్ క్లీన్ డిజైన్ తో మూడు విభిన్న ఫినిషింగ్స్ తో వస్తుంది. డిప్ గ్రే, గిట్టర్ గోల్డ్, గ్రీన్ ఫాంటసీ షేడ్స్ లో కొనుగోలు చేయవచ్చు. 

ఇన్ ఫినిక్స్ జీరో 20 ఫీచర్లు

  • 6.7 అంగుళాల డిస్ ప్లేతో ఐపీఎస్ ఎమోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ 
  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 60 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 108 ఎంపీ బ్యాక్ కెమెరా విత్ 13 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్త్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్
  • 6 ఎన్ఎం మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్
  • 45 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, చార్జింగ్ కోసం టైప్ సీ కేబుల్
  • ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ను సపోర్ట్ చేస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..