మానసిక గాయాల్ని మాన్పించే మందు ఇదొక్కటే! మెడికల్ షాపులో దొరకదు
సాధారణంగా చాలా సందర్భాల్లో మన మాటల వల్ల కానీ, చేతల వల్ల గానీ ఎవరినైనా బాధ పెట్టి ఉండవచ్చు. ఆ సమయంలో మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ, అవి వారి మనసుకు మానని గాయాలను చేసివుండవచ్చు. అందుకే, మనం ఎవరితోనైనా వారు నొచ్చుకునేలా వ్యవహరిస్తే మాత్రం వారికి క్షమాపణ చెప్పడం ఉత్తమమైన మార్గమని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మనకు తెలిసి లేదా తెలియక మన జీవితంలో చాలా మందినే నొప్పిస్తుంటాం. మన మాట వల్ల కానీ, చేతల వల్ల గానీ వారు తీవ్రమైన మనోవేదనకు గురై ఉండవచ్చు. ఆ సమయంలో మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ, అవి వారి మనసుకు మానని గాయాలను చేసివుండవచ్చు. అందుకే, మనం ఎవరితోనైనా వారు నొచ్చుకునేలా వ్యవహరిస్తే మాత్రం వారికి క్షమాపణ చెప్పడం ఉత్తమమైన మార్గమని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనం చేసిన గాయం క్షమాపణతో కొంత మేర తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
క్షమాపణ చెప్పడానికి సంకోచించవద్దని, లేదంటే వారిలో అపరాధన భావన పెరిగుతుందని చెబుతున్నారు. క్షమాపణ చెప్పడం లేదా తప్పు చేసినవారిని క్షమించడం ఉత్తమమైన లక్షణాలని మానసిక నిపుణులు అంటున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే.. క్షమాపణ చెప్పాలి. ఇతరులను క్షమించాలి. లేదంటే అహంకారులుగా పరిగణించే అవకాశం ఉందని అంటున్నారు. ఎదుటివారిని ధ్వేషించడం మొదలు పెడతారని చెబుతున్నారు.
జీవితం అందంగా, ఆనందంగా ఉండాలంటే..
అందుకే మానవ సంబంధాల్లో మనం క్షమాపణ చెప్పడం ఎంత ముఖ్యమో.. క్షమించడం అంతకంటే మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు. క్షమించడం నేర్చుకుంటే మన జీవితం మరింత అందంగా, ఆనందంగా మారుతుందని అంటున్నారు. ఎక్కువగా కుటుంబ జీవితంలో క్షమాపణ అనేది తప్పనిసరి అని అంటున్నారు. క్షమాపణతో ఎలాంటి బంధాలైనా నిలబడతాయని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
క్షమాపణల కోసం ఇలా చేయొద్దు
ఒక మహిళ ఒక పురుషుడి దగ్గర పనిచేస్తోంది. ఆమెకు సహజంగానే నత్తి ఉంది. అక్కడున్నవారందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఒకసారి, ఆమె మాటలను ఆమె ముందున్న వ్యక్తి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇందుకు ఆమె క్షమాపణలు చెప్పి.. తాను ఏం చెప్పదల్చుకున్నారో వివరించింది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన పనులు తప్పుకాకపోయినా.. ఆమెపై ప్రతీదానికీ ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.
తన వల్ల తప్పు జరగకపోయినప్పటికీ అతను ఆమె నుంచి క్షమాపణలు ఆశించేవాడు. కానీ, ఆమె మాత్రం చేయని తప్పునకు ఎందుకు క్షమాపణలు చెప్పాలని చెప్పేది కాదు. అతను తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆమె మానిసికంగా కుంగిపోయింది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించేది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగాన్ని మానేసింది. అయినప్పటికీ ఆమె అతని ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది.
క్షమాపణలు ఎప్పుడు చెప్పాలి? ఎవరిని క్షమించాలంటే?
అయితే, అతను అడిగినట్లుగా ఆమె క్షమాపణ చెబితే సరిపోయేది కదా.. అని చాలా మంది అనుకునే ఉంటారు. కానీ, చేయని తప్పునకు కూడా క్షమాపణ చెప్పడం అనేది ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడమే అవుతుంది. అందుకే ఆమె క్షమాపణ చెప్పేందుకు నిరాకరించింది. ఇలాంటి సమయంలో క్షమాపణ చెప్పడం అనేది సరైనది కాదు. తెలిసీ, తెలియక చేసిన తప్పునకు క్షమాపణ కోరడం ఉత్తమమే కానీ.. చేయని తప్పునకు అలా చేయడం మాత్రం సరైంది కాదని సైకాలజిస్టులు అంటున్నారు.
తప్పు చేసిన వ్యక్తి తన హృదయపూర్వకంగా క్షమాపణలు చెబితే మాత్రం వారిని క్షమించడం ఉత్తమం. వారు చేసిన తప్పును తెలుసుకుని అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబితే వారిని క్షమించాలి. అయితే, బలవంతంగా క్షమాపణలు చెప్పించుకోవడం సరికాదు. అదే సమయంలో, పదే పదే తప్పులు చేస్తూ, అవమానిస్తూ క్షమాపణలు అడిగేవారిని మాత్రం ఎప్పటికీ క్షమించకూడదు.