పెళ్లైన స్త్రీలు ఎరుపు రంగు సింధూరమే ఎందుకు ధరించాలో తెలుసా?
Samatha
2 January 2026
వివాహానికి ముందు అమ్మాయిలు ఎలాంటి సింధూరం పెట్టుకున్నా, కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం తెలపరు.
అయితే వివాహం అయిన తర్వాత మాత్రం తప్పకుండా నొదుట ఎరుపు రంగు సింధూరమే పెట్టుకోవాలి అంటారు. కాగా, దీనికి గల కారణాలు ఏవో చూద్దాం.
ఎరుపు రంగు అనేది విజయానికి గుర్తు. అందువలన ఏ స్త్రీ అయితే ఎరుపు రంగు సింధూరం ధరిస్తే, తన భర్త అన్నింట్లో విజయాన్ని పొందుతాడంట.
అదే విధంగా ఎరుపు రంగు సింధూరం సౌభాగ్యం, భర్త దీర్ఘాయువుకు చిహ్నం. అందుకే భార్య ఎరుపు రంగు సింధూరం నిత్యం ధరించాలని చెబుతుంటారు.
అలాగే ఎరుపు రంగు ప్రేమకు గుర్తు. అందువలన ఎవరు అయితే నిత్యం ఎరుపు రంగు కుంకుమను ధరిస్తారో, వారు చాలా శక్తిని కలిగి ఉంటారంట.
ఎరుపు రంగు కుంకుమను ఏ స్త్రీ అయితే నిత్యం నుదుట ధరిస్తుందో, ఆ స్త్రీ వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. ప్రతికూలత తొలిగిపోతుందంట.
అంతే కాకుండా భర్త దీర్ఘాయువు, బంధాన్ని మరింత బలోపేతం చేసే శక్తి ఎరుపు రంగుకు ఉంటుంది. అందుకే వివాహం అయిన ప్రతి స్త్రీ ఎరుపు రంగు కుంకుమ ధరించాలి అంటారు.
ఇక గ్రంథాల ప్రకారం, ఎరుపు రంగు సింధూరం వివాహానికి పవిత్ర చిహ్నం. అలాగే ఇది స్త్రీ, భద్రత, రక్షణతో కూడా ముడి పడి ఉంటుందంట.