AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు గాక.. కానీ ‘నువ్వు నాకు నచ్చావ్’ వెంకీ కెరీర్ లోనే చాలా స్పెషల్.. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువైపోయాడు వెంకటేష్. 2001లో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత
Aarthi Agarwal
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2026 | 11:41 AM

Share

ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి వరుసలో ఉండే సినిమా నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ పరిచయం అయ్యింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. ఇప్పటికీ ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ లోనూ ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ముచ్చట్లను నిర్మాత శ్రవంతి రవికిషోర్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో.. స్రవంతి రవికిషోర్, దివంగత నటి ఆర్తీ అగర్వాల్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లతో తన సినీ ప్రయాణంలోని మధురానుభూతులను పంచుకున్నారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని మెట్ల షాట్ గురించి మాట్లాడుతూ, దర్శకుడు భాస్కర్ ఈ షాట్ ను గొప్పగా ఊహించుకున్నారని, ఊటీలో సరైన లొకేషన్ దొరకకపోవడంతో రామానాయుడు స్టూడియోస్‌లో రాజచంద్రపురం సెట్‌లో దీన్ని చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన సరిపోయే హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు, భాస్కర్ కొత్త ముఖం కావాలని, స్టార్ డమ్ ఉన్నవారు కాకుండా, క్యారెక్టర్ కు సరిపోయే అమ్మాయి కావాలని భావించారని రవికిషోర్ అన్నారు. ఈ క్రమంలో ముంబై వెళ్లి మోడలింగ్ ఏజెన్సీలను సంప్రదించగా, పాగల్ పన్ అనే హిందీ సినిమాలో నటించిన ఆర్తీ అగర్వాల్ ఫోటోను చూసి భాస్కర్ ఆమెనే నందిని అని నిర్ణయించారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ నుంచి ఆర్తీ అగర్వాల్ ను పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి సినిమాలోకి తీసుకున్నారని రవికిషోర్ గుర్తుచేసుకున్నారు. ఆర్తీ అంకితభావం గొప్పదని, ఆమె తెలుగు భాష తెలియకపోయినా, న్యూజిలాండ్ లో పాటల షూటింగ్ సమయంలో తెలుగు లిరిక్స్ ను చదివి నేర్చుకొని వచ్చిందని తెలిపారు. లంగా ఓణీలో ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించిందని అన్నారు. షూటింగ్ షెడ్యూల్ ముగిసి అమెరికాకు తిరిగి వెళ్లేటప్పుడు, పెద్దల కాళ్లకు నమస్కరించి వెళ్లేదని, అది చూసి అందరం షాక్ అయ్యాం. అంత అందమైన మనసున్న అమ్మాయి అని అన్నారు. చక్కటి సంస్కారం ఉందని రవికిషోర్ అన్నారు. ఆర్తీ అగర్వాల్ అకాల మరణం గురించి తెలుసుకున్నప్పుడు తీవ్రంగా బాధపడ్డామని, అంత గొప్ప వ్యక్తి ఇక లేదనే వార్త కలచివేసిందని శ్రవంతి రవికిషోర్ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.