AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 ప్రయోగ రాజ్‌లో మాఘమేళ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం!

ప్రయోగ రాజ్ మాఘమేళాకు సిద్ధం అయ్యింది. 2025లో మహా కుంభ మేళ జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం మాఘ మేళా జరుగుతుంది. కాగా, 2026లో మాఘ మేళ ఎప్పుడు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రయోగరాజ్‌లో మాఘమేళ జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు, మాఘమేళలో పాల్గొనడానికి ప్రయోగరాజ్ వెళ్తుంటారు. గంగ, యమునా, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమం, ఒడ్డున జరిగే ఈ మాఘమేళాలో స్నానాలు ఆచరించిన వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. పరమశివుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతుంటారు.

Samatha J
|

Updated on: Jan 02, 2026 | 11:59 AM

Share
ముఖ్యంగా ఈ కాలంలో ప్రయోగరాజ్‌లో స్నానం చేయడం వలన ఇది పాపాలను శుద్ధి చేసి, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుందంట. చెడు దృష్టి నుంచి కాపాడటమే కాకుండా, జనన మరణ చక్రం నుంచి భక్తులను విముక్తి చేస్తుంది. ఇక 2026లో మాఘ మేళ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే? జనవరి 3 ,2026న మాఘ మేళ ప్రారంభమై, ఫిబ్రవరి 15,2026 మహా శివరాత్రి రోజు ముగుస్తుంది. ఈ పండుగ దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతోంది.  ఇక ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రయోగరాజ్‌లో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు.

1 / 5
కాగా, మాఘ మేళలో స్నానం చేయాల్సిన శుభప్రదమైన తేదీలు ఏవో ఇప్పుడు చూద్దాం. పూర్ణిమ జవరి, 3. మకర సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 18, వసంత పంచమి జనవరి 23, మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1, మహా శివరాత్రి ఫిబ్రవరి 15. మరీ ముఖ్యంగా మౌనీ  అమావాస్య రోజున మాఘ మేళలో పాల్గొని, ప్రయోగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా మంచిదంట.

2 / 5
ఇక  హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. ఒక హరి ద్వార్, జ్జయని, నాసిక్, ప్రయోగరాజ్.  అందువలన ఈ ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభ మేళ జరుగుతుంది. దీనిని మహా కుంభమేళ అంటారు. ఇక ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేళ జరుగుతుంది. ఈ సమయంలో ఇక్కడ స్నానం చేయడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయని అంటారు.

3 / 5
కాగా, ఇప్పుడు మనం మాఘ మేళా ఆచారాల గురించి తెలుసుకుందాం. మాఘ మేళాలో ప్రధాన ఆచారం సంగమంలో పవిత్ర స్నానం చేయడం. ఈ రోజుల్లో తెల్లవారు జామున, భక్తులు అందరూ ప్రార్థనలు, జపాలు చేస్తూ, నదిలోకి వెళ్లి పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక ఈ సమయంలో ప్రయాణికులు, భక్తులు, నాగ సాదువులు, అఘోరాలు, వివిధ రకాల సాదువులు ఊరేగింపులో కూడా పాల్గొనవచ్చు.

4 / 5
ఇక మాఘ మేళ సమయంలో కొంత మంది భక్తులు కల్పవాలు చేస్తారు. మాఘ మేళాలో ఇది ప్రత్యేకమైన ఆచారం.  దీనిలో భాగంగా కొంత మంది భక్తులు మాఘ మాసం అంతా నది ఒడ్డున, గుడారాలలో నివసిస్తూ,గంగా స్నానం, సాధారణ భోజనం చేస్తూ, ఉపవాసం, ధ్యానం, జపం చేస్తూ కఠినమైన దినచర్యను పాటిస్తారు. దీనిని కల్పవాలు అంటారు. ఇది మకర సంక్రాంతి రోజు ప్రారంభమై, శివరాత్రి వరకు కొనసాగుతుంది.

5 / 5