AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: మీరు తరుచూ రైల్లో ప్రయాణిస్తారా? అయితే, ఈ కార్డుల గురించి తెలుసుకోండి..

మన దేశంలో రైళ్లలో ప్రయాణించేవారే ఎక్కువ. ధర తక్కువగా ఉండడం.. ఎక్కడికైనా ట్రైన్స్ అందుబాటులో ఉండడమే దీనికి కారణం. నిత్యం రైలులో ప్రయాణించే వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఏ ఏ క్రెడిట్ కార్డులతో ఎటువంటి లాభాలు ఉంటాయనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

IRCTC: మీరు తరుచూ రైల్లో ప్రయాణిస్తారా? అయితే, ఈ కార్డుల గురించి తెలుసుకోండి..
Irctc Credit Cards
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 11:27 AM

Share

దేశంలో చాలా మంది తమ ప్రయాణానికి రైల్వేనే ఎంచుకుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఏటా కోట్ల మంది రైలులో ప్రయాణిస్తారు. అయితే కొన్ని క్రెడిట్ కార్డులతో మంచి ఆఫర్లు పొందవచ్చు. ఐఆర్‌సీటసీ సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ప్రయాణికులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ కార్డులు టికెట్ బుకింగ్‌లపై క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ఉచిత లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలను కల్పిస్తాయి.

రైలు ప్రయాణికులకు టాప్ 6 ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డులు..

ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఏసీ-క్లాస్ టికెట్ బుకింగ్‌లపై 10శాత వరకు క్యాష్‌బ్యాక్. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఫ్రీ రైల్వే లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.

ప్రత్యేకత: ఈ కార్డు తక్కువ వార్షిక రుసుముతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లపై 10శాతం వరకు రివార్డులు. ఏడాదికి నాలుగు సార్లు ఫ్రీ రైల్వే లాంజ్‌లకు యాక్సెస్ లభిస్తుంది.

ప్రత్యేకత: రూపే నెట్‌వర్క్‌లో లభించే ఈ కార్డు ప్రయాణికులకు తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ ప్రీమియర్ క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: అధిక రివార్డు పాయింట్లు, ఏడాదికి 8 సార్లు ఫ్రీ రైల్వే లాంజ్ యాక్సెస్ ఉంటుంది. రూ.1 లక్ష వరకు ఫ్రాడ్ బీమా కవరేజ్ ఉంటుంది.

ప్రత్యేకత: తరచుగా ప్రయాణించే వారికి మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఐఆర్‌సీటీసీ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లపై ప్రతి రూ.100కి 40 పాయింట్ల వరకు రివార్డులు వస్తాయి. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో కొనుగోళ్లపై కూడా అధిక రివార్డులు లభిస్తాయి.

ప్రత్యేకత: ప్రభుత్వ బ్యాంక్ కస్టమర్లకు, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఐఆర్‌సీటీసీ హెడ్‌ఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లపై ప్రతి రూ.100కి 5 పాయింట్లు వస్తాయి. SmartBuy ద్వారా బుక్ చేస్తే 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభస్తుంది. ఏడాదికి 8 ఉచిత లాంజ్ యాక్సెస్ ఉంటుంది.

ప్రత్యేకత: స్మార్ట్‌బై వంటి అదనపు ఆఫర్లను అందిస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్:

ప్రయోజనాలు: ఏడాదికి 8 ఉచిత రైల్వే లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. మెట్రో, బస్ ప్రయాణాలకు NCMC సపోర్ట్ ఉంటుంది. రూ.5,000 వరకు ట్రైన్ టికెట్ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది.

ప్రత్యేకత: క్యాన్సలేషన్ ప్రొటెక్షన్, CMC మద్దతు వంటి ప్రత్యేక ఫీచర్లతో రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది.

సరైన కార్డును ఎలా ఎంచుకోవాలి?

కార్డును ఎంచుకునే ముందు, మీ ప్రయాణ అవసరాలను, ఖర్చు చేసే విధానాన్ని, వార్షిక ఫీజులను, రివార్డులను ఎలా ఉపయోగించుకోవచ్చో పక్కాగా తెలుసుకోవాలి. మీరు తరచుగా ప్రయాణించే వారైతే ఎక్కువ లాంజ్ యాక్సెస్, అధిక క్యాష్‌బ్యాక్ ఉన్న కార్డులు ఉత్తమం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే, మీ బడ్జెట్‌కు సరిపోయే కార్డును ఎంచుకోవాలి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు ఎంచుకున్న బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ను నింపి.. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన తర్వాత, కార్డు మీ చిరునామాకు వస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..