AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Influential Companies: ఇన్‌ఫ్లూయెన్షియల్ కంపెనీల్లో మూడు భారత కంపెనీలకు చోటు.. టైమ్ మ్యాగజైన్ తాజా ప్రకటన

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా గ్రూప్, అదార్ పూనావల్ల నేతృత్వంలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీలు టైమ్ మ్యాగజైన్ 2024కి ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలుగా గుర్తించారు. లీడర్‌లు, డిస్‌రప్టర్స్, ఇన్నోవేటర్స్, టైటాన్స్, పయనీర్స్ వంటి వివిధ వర్గాలలో టాప్ 100 కంపెనీలను వర్గీకరించే టైమ్‌కు సంబంధించిన వార్షిక జాబితాలో మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. 

Influential Companies: ఇన్‌ఫ్లూయెన్షియల్ కంపెనీల్లో మూడు భారత కంపెనీలకు చోటు.. టైమ్ మ్యాగజైన్ తాజా ప్రకటన
Influencial Companies
Nikhil
|

Updated on: May 31, 2024 | 4:45 PM

Share

భారతదేశం ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చకుంటున్నాయి. తాజాగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా గ్రూప్, అదార్ పూనావల్ల నేతృత్వంలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీలను టైమ్ మ్యాగజైన్ 2024కి ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలుగా గుర్తించారు. లీడర్‌లు, డిస్‌రప్టర్స్, ఇన్నోవేటర్స్, టైటాన్స్, పయనీర్స్ వంటి వివిధ వర్గాలలో టాప్ 100 కంపెనీలను వర్గీకరించే టైమ్‌కు సంబంధించిన వార్షిక జాబితాలో మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి.  రిలయన్స్, టాటా గ్రూప్‌లు టైటాన్స్ కేటగిరీలో ఉంచగా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పయనీర్స్ కేటగిరీకి ఎంపికైంది. ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన తాజా జాబితా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టైమ్ మ్యాగజైన్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియాస్ జగ్గర్నాట్‌గా పేర్కొంది. 58 సంవత్సరాల క్రితం ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ కంపెనీ టెక్స్‌టైల్, పాలిస్టర్ కంపెనీ నుంచి భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా రూపాంతరం చెందింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్లకు మించిపోయింది. టైమ్ మ్యాగజైన్ రిలయన్స్‌ను గుర్తించడంలో ముఖ్యమైన రిలయన్స్-డిస్నీ ఒప్పందాన్ని కూడా హైలైట్ చేసింది. 8.5 బిలియన్ల డాలర్ల ఒప్పందం భారతదేశానికి సంబంధించిన వేగంగా అభివృద్ధి చెందుతున్న స్ట్రీమింగ్, ఓటీటీ మార్కెట్‌లో రిలయన్స్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. రిలయన్స్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా టైమ్ గుర్తించింది. ఏటా 3.5 బిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేస్తుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన కంపెనీలలో ఒకటి. దాని విస్తారమైన పోర్ట్‌ఫోలియో ఐరన్, సాఫ్ట్‌వేర్, గడియారాలు, జలాంతర్గామి కేబుల్స్, రసాయనాల నుంచి ఉప్పు, తృణధాన్యాలు, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాషన్, హోటళ్ల వరకు విస్తరించింది. పెట్టుబడి పెట్టడం ద్వారా టెక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏఐ, సెమీకండక్టర్ చిప్‌లతో కూడిన ఈ గ్రూప్ 2023లో ఐఫోన్‌లను అసెంబుల్ చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. టైమ్‌కు సంబంధించిన 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల నాలుగో వార్షిక జాబితా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ప్రభావాన్ని చూపుతుంది. ఎంపిక ప్రక్రియలో వివిధ రంగాల నుంచి నామినేషన్లు, టైమ్‌కు సంబంధించిన గ్లోబల్ నెట్‌వర్క్ కంట్రిబ్యూటర్లు, కరస్పాండెంట్లు, బయటి నిపుణుల నుంచి ఇన్‌పుట్, ప్భారవం, ఆవిష్కరణ, ఆశయం, విజయం ఆధారంగా మూల్యాంకనాలు ఉంటాయి. టైమ్ 100 కంపెనీల జాబితా జూన్ 10, 2024న టైమ్ సంచికలో ప్రదర్శిస్తారు. శుక్రవారం మే 31 నుంచి న్యూస్‌స్టాండ్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..