AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: నీతా అంబానీ ఈ నెక్లెస్ ధర ఎంతో తెలుసా.. ? ఇది కేవలం 178 రూపాయలకే లభిస్తుంది!!

నీతా అంబానీ జి నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది. ఇది కూడా 'హోల్‌సేల్ మాత్రమే, రిటైల్ కాదు. దీంతో మీరు చేసిన పనికి ధన్యవాదాలు అంటూ స్వర్ణకారుడిని ప్రశంసించారు పలువురు నెటిజన్లు. తన భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతి ఇస్తాను' అని మరొకరు వ్యాఖ్యానించారు.

Nita Ambani: నీతా అంబానీ ఈ నెక్లెస్ ధర ఎంతో తెలుసా.. ? ఇది కేవలం 178 రూపాయలకే లభిస్తుంది!!
Nita Ambani
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 12:52 PM

Share

మన దేశంలో అంబానీ కుటుంబం విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జూలైలో పెళ్లి జరగనుండగా.. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఇప్పటికే అట్టహాసంగా జరిగాయి. రెండు నెలల క్రితం జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో నీతా అంబానీ, ఇషా అంబానీ ధరించిన ఆభరణాల ధర ఎంత అని ఆరా తీస్తే.. వారి కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నీతా అంబానీ పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. దీని ధర 500 కోట్లు.. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే… ఇప్పుడు ఆ నక్లెస్‌కి ప్రతిరూపమైన మోడల్‌ మార్కెట్లోకి వచ్చింది.

రూ.500 కోట్ల విలువైన హారం కదా.. దాని ప్రతిరూపం కనీసం లక్ష లేదా వేలల్లో ఉంటుంది అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.. ఓ వ్యక్తి ఆన్ లైన్ లో అలాంటి రూపంతో ఉన్న హారాన్ని కేవలం రూ.178కే విక్రయిస్తుండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో, స్వర్ణకారుడు ఈ ప్రతిరూపాలను ఎంతో ఉత్సాహంగా విక్రయిస్తున్నాడు.’నీతా అంబానీ జి నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది. ఇది కూడా ‘హోల్‌సేల్ మాత్రమే, రిటైల్ కాదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, వీడియోను 3.15 మిలియన్లకు పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిపై స్పందించారు.

View this post on Instagram

A post shared by V. V. SONS (@v.v.sons)

‘కాపీ చేయడంలో భారతదేశం అత్యుత్తమమైనది’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, తక్కువ ధరలకు విలాసవంతమైన వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేశారు. మరికొందరు ‘ఇందులో తప్పేముంది, అందరూ ఎవరికి నచ్చిన ఫ్యాషన్‌కి అందరూ అర్హులే అంటూ పేర్కొన్నారు. అందుకు డబ్బు అడ్డంకి కాకూడదని అన్నారు. మీరు చేసిన పనికి ధన్యవాదాలు అంటూ స్వర్ణకారుడిని ప్రశంసించారు. తన భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతి ఇస్తాను’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..