AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన ఫోన్ తీసుకున్నాడనే కోపంతో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య..? కుర్చీకి కట్టేసి మరీ చిత్రహింసలు..చివరకు..

ప్రదీప్‌ సింగ్‌పై ఆగ్రహంతో ఆమె.. అదను చూసి అతనికి మత్తుమందు ఇచ్చింది. అనంతరం కుర్చీకి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు కరెంట్‌ షాక్‌ పెట్టింది. అడ్డుకోబోయిన తన కుమారుడిపై కూడా దాడి చేసింది. చివరకు.. ప్రస్తుతం బేబీ యాదవ్‌ పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.

తన ఫోన్ తీసుకున్నాడనే కోపంతో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య..? కుర్చీకి కట్టేసి మరీ చిత్రహింసలు..చివరకు..
Electric Shock
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 12:26 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్య మొబైల్ వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్న ఓ భర్తకు ఆ ఇల్లాలు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. భర్త ఫోన్‌ తీసుకున్నాడనే కోపంతో రగిలిపోయిన ఆమె భర్తపై దాడికి దిగింది. కరెంట్‌ షాక్‌ పెట్టి చిత్ర హింసలకు గురిచేసింది. భార్య బ్యాడ్‌ హ్యాబిట్ తగ్గించాలనుకున్న ఆ భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్‌, ప్రదీప్‌ సింగ్ భార్యా భర్తలు. వారికి 14ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, బేబీ యాదవ్‌ గత కొంత కాలంగా మొబైల్‌ ఫోన్‌కు బాగా అలవాటుపడిపోయింది. గంటల తరబడి ఫోన్‌లోనే కాలం గడుపుతోందనే ఆరోపణతో ఆమె భర్త తనను పలుమార్లు మందలించాడు. అలవాటు మానుకోవాలని ఆమెను అతడు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దానికి వారు ఆమె నుంచి ఫోన్‌ తీసుకోవాలని సలహా ఇచ్చారట. దాంతో అతడు ఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. అంతే.. ప్రదీప్‌ సింగ్‌పై ఆగ్రహంతో ఆమె.. అదను చూసి అతనికి మత్తుమందు ఇచ్చింది. అనంతరం కుర్చీకి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు కరెంట్‌ షాక్‌ పెట్టింది. అడ్డుకోబోయిన తన కుమారుడిపై కూడా దాడి చేసింది.

అయితే ఎలాగోలా అమె నుంచి తప్పించుకున్న ప్రదీప్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రదీప్ సింగ్ ప్రస్తుతం సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. కాగా, బేబీ యాదవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బేబీ యాదవ్‌ పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు