Work In Dubai: దుబాయ్ హోటల్‌లో వెయిటర్‌కే రూ.2 లక్షల జీతం… అక్కడ పని చేసే వారికి షాకింగ్ సంపాదన..
తక్కువ విద్యార్హతతోనే అధిక సంపాదన పొందాలంటే కచ్చితంగా దుబాయ్ వెళ్లాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక స్థాయిలో యువత ఇలా విదేశాలు వెళ్లి డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. దుబాయ్‌లో ఉద్యోగం పొందడానికి కొన్ని దశలు అవసరం. కంపెనీల ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా యూఏఈలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన తర్వాత దరఖాస్తుదారులు తమ ఉద్యోగాలు ఉన్న దేశాల్లో వర్క్ పర్మిట్ వీసాల కోసం వెళ్లవచ్చు.

మీ అందరికీ రవితేజ నటించిన దుబాయ్ శీను సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించడమే ఆశయంగా పెట్టుకుంటాడు. అనంతరం వేణుమాధవ్ (ఏజెంట్) చేతిలో మోసపోతాడు. ఈ సినిమా సంగతి వదిలేస్తే దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించడం అనేది చాలా మందికి కల. ఎందుకంటే తక్కువ విద్యార్హతతోనే అధిక సంపాదన పొందాలంటే కచ్చితంగా దుబాయ్ వెళ్లాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక స్థాయిలో యువత ఇలా విదేశాలు వెళ్లి డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. దుబాయ్‌లో ఉద్యోగం పొందడానికి కొన్ని దశలు అవసరం. కంపెనీల ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా యూఏఈలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన తర్వాత దరఖాస్తుదారులు తమ ఉద్యోగాలు ఉన్న దేశాల్లో వర్క్ పర్మిట్ వీసాల కోసం వెళ్లవచ్చు. అయితే దుబాయ్‌లో పని చేసే ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయో? ఓ సారి తెలుసుకుందాం.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రధాన నగరం దుబాయ్. గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంది ఉద్యోగార్థులకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా 50వ, 60 వ దశకంలో కేవలం ఎడారిగా ఉన్న ప్రాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలకు గో-టు ప్లేస్ హబ్‌గా మారింది. ఈ ప్రాంతంలో వ్యాపారం విపరీతంగా పెరగడంతో అక్కడకు వెళ్లి పని చేసి అధిక సొమ్ము సంపాదించాలనుకునే భారతీయులకు ఓ స్వర్గధామంలా మారింది. చాలా మంది 2 నుంచి 5 ఏళ్లు అక్కడే ఉండి డబ్బు సంపాదించి ఇండియాలో స్థిరపడతారు. కాబట్టి యూఏఈలో పనిచేసే వ్యక్తులు ఎంత జీతం పొందుతారు అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.
కొన్ని నివేదికల ప్రకారం దుబాయ్‌లో పనిచేసే కార్మికులు నెలకు దాదాపు 2000 దిర్హామ్‌లు సంపాదిస్తారు. ఇది మన కరెన్సీలోకి మారిస్తే రూ. 45000. అలాగే మరో నివేదిక ప్రకారం దుబాయ్‌లోని కార్మికుల సగటు జీతం నెలకు 600 నుంచి 3000 దిర్హామ్‌ల వరకు ఉంటుంది. అంటే రూ.13,000 నుంచి రూ.68,000 వరకూ ఉంటుంది. అలాగే దుబాయ్‌లోని ప్రముఖ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తే మీరు నెలకు 10,070 దిర్హామ్‌లు (రూ. 2,26,685) జీతం కూడా పొందవచ్చు. దుబాయ్‌లోని ఒక డెంటిస్ట్ నెలకు 39,120 దిర్హామ్‌లు (రూ. 8,86,791) సంపాదిస్తున్నాడు.
అంతర్జాతీయ మానవ వనరుల నివేదిక ప్రకారం యూఏఈలో ఒక వ్యక్తి సగటు జీతం 16,500 దిర్హామ్‌లు అంటే ఇది సుమారుగా రూ. 3,74,030. అయితే ఇది ఆ దేశస్తులకు మాత్రమే ఎన్‌బీ-యూఏఈ ల్లో ఉద్యోగాల పేరుతో ఇటీవలి కాలంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే ముందు సరైన తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..