Telangana – Dubai: దుబాయ్‌లో 17 ఏళ్ల జైలు జీవితం నుంచి తెలంగాణ వాసికి విముక్తి..
దుబాయ్‌లో ఓ హత్యకేసులో నిందితుడుగా 17 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న తెలగాణ యువకుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 17 ఏళ్లు తర్వాత అక్టోబరు 6న తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతుల కుమారుడు లక్ష్మణ్‌కు 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ నేపాలీ సెక్యూరిటీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
దుబాయ్‌లో ఓ హత్యకేసులో నిందితుడుగా 17 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న తెలగాణ యువకుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 17 ఏళ్లు తర్వాత అక్టోబరు 6న తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతుల కుమారుడు లక్ష్మణ్‌కు 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ నేపాలీ సెక్యూరిటీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి మంత్రి కేటీఆర్ నగదు పరిహారంగా ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దుబాయ్ ప్రభుత్వం శిక్షను యథావిధిగా కొనసాగించింది. ఇటీవల దుబాయ్ వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. క్షమాభిక్ష కోసం దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులతోపాటు, అక్క డి అధికారులతో చర్చించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లక్ష్మణ్ అనారోగ్యం పాలవడంతో న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు అతని విడుదలకు ఆమోదం తెలిపింది. దాంతో జైలునుంచి విడుదలైన లక్ష్మణ్ పదిహేడేళ్ల జైలు జీవితం తర్వాత స్వస్థలానికి చేరుకుని, తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..