Teacher: టీచర్.. అదేం పాడు పని..? దెబ్బలు పడితే కానీ వివరం రాలేదు సారుకి.. వీడియో
కాకినాడ జిల్లా పిఠాపురంలో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. బాలికలను లైంగికంగా వేధించినట్లు ఉపాధ్యాయుడిపై గత కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో తల్లిందండ్రులంతా కలిసి దేహశుద్ధి చేశారు. రెండు నెలలుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సోషల్ టీచర్ దుర్గారావు. ఏడో తరగతి విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. బాలికలను లైంగికంగా వేధించినట్లు ఉపాధ్యాయుడిపై గత కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో తల్లిందండ్రులంతా కలిసి దేహశుద్ధి చేశారు. రెండు నెలలుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సోషల్ టీచర్ దుర్గారావు. ఏడో తరగతి విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రిన్సిపాల్ సహా ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటోంది బాధితురాలి తల్లి. ఇంత జరుగుతున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టారు. విషయం తెలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు పిఠాపురం పోలీసులు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధిత ఫ్యామిలీ శాంతించకపోగా.. ఆ ఉపాధ్యాయుడిని పిలిపించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు వచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అక్కడకు టీచర్ రావడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..