Recurring Deposits: బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఎక్కడ అధిక వడ్డీ వస్తుంది? ఆర్‌డీ ఎక్కడ ప్రారంభిస్తే మేలు? పూర్తి వివరాలు ఇవి..

రికరింగ్ డిపాజిట్లలో ప్రయోజనాలు పోస్ట్ ఆఫీసులు అయినా లేక బ్యాంకులు అయిన ఒకేలా ఉంటాయి. అయితే వడ్డీ రేట్లలో మాత్రం బ్యాంకులకు, పోస్ట్ ఆఫీసులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. అన్ని పోస్ట్ ఆఫీసులు ఒకే రకమైన వడ్డీ రేటు కలిగి ఉంటుంది. అయితే బ్యాంకుల్లో వివిధ రకాల వడ్డీ రేట్లు అమలులో ఉంటాయి. ఇప్పుడు ఐదళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో వడ్డీ రేట్లను ఓసారి చూద్దాం.

Recurring Deposits: బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఎక్కడ అధిక వడ్డీ వస్తుంది? ఆర్‌డీ ఎక్కడ ప్రారంభిస్తే మేలు? పూర్తి వివరాలు ఇవి..
Money
Follow us
Madhu

|

Updated on: Oct 20, 2023 | 6:15 PM

అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల తర్వాత రికరింగ్ డిపాజిట్లు(ఆర్‪‌డీలు) ఉంటాయి. తక్కువ మొత్తాలలో నెలవారీ దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. అధిక కాలవ్యవధితో ఉండే ఈ పథకంలో లాభాలు కూడా బాగా వస్తాయి. దీనిలో నెలవారీతో పాటు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టొచ్చు. దీనిలో వడ్డీ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వచ్చినట్లుగానే వస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు బ్యాంకులు, పోస్టు ఆఫీసుల్లో అవకాశం ఉంది. నెలవారీ శాలరీ పొందే ఉద్యోగులతో పాటు నాన్ శాలరీడ్ వ్యక్తులు కూడా దీనిలో పెట్టుబులు పెట్టొచ్చు.

రికరింగ్ డిపాజిట్ ప్రయోజనాలు ఇవి..

రికరింగ్ డిపాజిట్లలో ప్రయోజనాలు పోస్ట్ ఆఫీసులు అయినా లేక బ్యాంకులు అయిన ఒకేలా ఉంటాయి. అయితే వడ్డీ రేట్లలో మాత్రం బ్యాంకులకు, పోస్ట్ ఆఫీసులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. అన్ని పోస్ట్ ఆఫీసులు ఒకే రకమైన వడ్డీ రేటు కలిగి ఉంటుంది. అయితే బ్యాంకుల్లో వివిధ రకాల వడ్డీ రేట్లు అమలులో ఉంటాయి. ఇప్పుడు ఐదళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో వడ్డీ రేట్లను ఓసారి చూద్దాం. పోస్ట్ ఆఫీసులో ఎలా ఉంటుంది? ఎస్బీఐ, హెచ్డీఎఫ్ సీ బ్యాంకుల్లో ఎలా ఉంటుంది తెలుసుకుందాం రండి..

రికరింగ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు ఇలా..

డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వం 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచినందున, ఈ రేట్లు ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండింటికీ కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఎస్బీఐలో 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఆర్‌డీ లపై 5.75 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6 నెలల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై పై 4.50 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

పోస్ట్ ఆఫీసులో ఇలా.. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ పేర్కొన్నట్లుగా, 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి ఇష్టపడే ఆసక్తిగల వ్యక్తులు నెలకు కనీసం రూ. 100 లేదా ఏదైనా ఇతర మొత్తాన్ని 10 గుణిజాలలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఆర్‌డీ డిపాజిట్లు సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సాధారణ డిపాజిటర్లకు సంవత్సరానికి 6.50 శాతం నుంచి 6.80 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఆర్డీ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వారు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి కనీసం రూ. 100 డిపాజిట్‌తో ఖాతాను ప్రారంభించవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్‌లకు 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటాయి. సీనియర్ సిటిజన్‌లకు 5 శాతం నుంచి 7.75 శాతం మధ్య ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆర్‌డీ ఖాతా తెరవాలనుకునే వారు 6 నెలల నుంచి10 సంవత్సరాల కాలవ్యవధితో కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..