AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ముంచుకొస్తున్న గడువు.. వారం రోజుల్లో ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే..!

ఇటీవల ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకునే వారికి ఉచితంగా మార్చుకునే వెసులుబాటును యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇచ్చింది. డిసెంబర్ 2023 ఈ ఆదేశాలు ఇవ్వగా దఫదఫాలుగా గడువు పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ గడువు మార్చి 14తో ముగియనుంది. అయితే గడువు ముగిశాక కూడా ఆధార్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్నా దానికి నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Update: ముంచుకొస్తున్న గడువు.. వారం రోజుల్లో ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే..!
Aadhaar Card
Nikhil
|

Updated on: Mar 06, 2024 | 6:30 PM

Share

భారతదేశంలో ప్రతి చిన్న అవసరానానికి ఆధార్ ఆధారంగా మారింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. అయితే ఇటీవల ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకునే వారికి ఉచితంగా మార్చుకునే వెసులుబాటును యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇచ్చింది. డిసెంబర్ 2023 ఈ ఆదేశాలు ఇవ్వగా దఫదఫాలుగా గడువు పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ గడువు మార్చి 14తో ముగియనుంది. అయితే గడువు ముగిశాక కూడా ఆధార్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్నా దానికి నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. మై ఆధార్ అధికారిక పోర్టల్‌లో మాత్రమే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు మీ ఆధార్ కార్డ్‌ను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం. 

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్

  • మై ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. 
  • “చిరునామాను నవీకరించడానికి కొనసాగండి” అని తెలిపే ఎంపికను ఎంచుకోవాలి. 
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని టైప్ చేయాలి. 
  • “డాక్యుమెంట్ అప్‌డేట్” ఎంపికపై క్లిక్ చేస్తే, ఇప్పటికే ఉన్న వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • వివరాలను ధ్రువీకరించడంతో పాటు తదుపరి హైపర్‌లింక్‌ను ఎంచుకోవాలి. 
  • డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువుతో పాటు చిరునామా పత్రాలను ఎంచుకుని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి 
  • వివరాలను ధృవీకరించి సబ్మిట్ చేయాలి. 
  • అప్‌డేట్ అభ్యర్థన 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) క్రియేట్ అవుతుంది. అలాగే కొన్ని రోజులకు ఆధార్ అప్‌డేట్ అయిపోతుంది.

వ్యక్తిగత సమాచారం అప్‌డేట్ ఇలా

  • మై ఆధార్ సైట్‌కు వెళ్లి ఆధార్ నెంబర్ ఆధారంగా లాగిన్ అవ్వాలి. 
  • అనంతరం “పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా అప్‌డేట్”పై క్లిక్ చేయండి.
  • “ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయి” ఎంపికను ఎంచుకోవాలి. 
  • అవసరమైన మార్పులు చేసి సమర్పించుపై క్లిక్ చేయాలి. అనంతరం నిర్ధారణ సందేశం వస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!