Vida V2: మార్కెట్‌లో విడా వీ2 స్కూటర్ల సందడి.. వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇవే..!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటాకార్ప్ కు దేశంలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలు మార్కెట్ లో సంచలనం రేపాయి. నాణ్యత, పనితీరు, ఆకట్టుకునే లుక్ తో పాటు ప్రజలకు అందుబాటు ధరలలో వాహనాలు తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా హీరో మోటోకార్ప్ ప్రవేశించింది. అక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. తన పోర్టుపోలియోను క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి విడా వీ2 స్కూటర్లు విడుదల అయ్యాయి. హీరో మోటాకార్ప్ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటికి మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. వీ1 స్కూటర్ల అప్ గ్రేడ్ వెర్షన్ గా భావించే వీ2 సిరీస్ స్కూటర్లు ఇటీవల విడుదలయ్యాయి. దీనిలో విడా వీ2 లైట్, వీ2 ప్లస్, వీ2 ప్రో అనే మూడు రకాల మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలను రూ.96 వేలు, రూ.1.15 లక్షలు, రూ.1.35 లక్షలుగా నిర్ధారించారు.
వీడా వీ2 సిరీస్ లోని మూడు రకాల మోడళ్ల బ్యాటరీ సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో లైట్ స్కూటర్ ను ప్రారంభ స్థాయి మోడల్ గా చెప్పవచ్చు. దీనిలో 2.2 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఒక్కసారి రీచార్జి చేసుకుంటే 94 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు సుమారు 710 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు. వీ2 ప్లస్ మోడల్ లో 3.44 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 143 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటలకు 85 కిలోమీటర్ల వేగంతో ఈ బండి పరుగులు తీస్తుంది.
వీ2 ప్రో మోడల్ లో 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ రీచార్జిపై 165 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గరిష్టంగా 90 కేఎంపీఎల్ వేగంగా పరుగెడుతుంది. కేవలం మూడు సెకన్లలోనే 40 కేఎంపీఎల్ వేగాన్ని అందుకుంటుంది. ఈ మోడళ్ల బ్యాటరీలను ఇంటిలోనే సులభంగా రీచార్జి చేసుకోవచ్చు. వీడా వీ2 స్కూటర్లలో ఏడు అంగుళాల టీఎఫ్ టీ టన్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, వెహికల్ టెలిమాటిక్స్, క్రూయిజ్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, కీలెస్ స్టార్ట్, అధునాతన బ్యాటరీ స్టేట్ ఆఫ్ చార్జి (ఎస్వోసీ) సూచికలు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వారంటీ విషయానికి వస్తే ఈ స్కూటర్లకు ఐదేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వాహన వారంటీ, బ్యాటరీ ప్యాక్ లపై మూడేళ్లు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ఓలా ఎస్ 1, ఏథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లకు వీడా వీ2 మోడళ్లు గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి