Bank Account: ఇన్‌యాక్టివేట్‌ అయిన అకౌంట్లపై ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు..!

Bank Account: ఇన్‌యాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లోజ్డ్ అకౌంట్లను వీలైనంత త్వరగా తెరవాలని బ్యాంకులకు సూచించింది. మరి అలాంటి అకౌంట్లను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..

Bank Account: ఇన్‌యాక్టివేట్‌ అయిన అకౌంట్లపై ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2024 | 3:16 PM

బ్యాంకుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు కీలక అప్‌డేట్స్‌ అందిస్తూనే ఉంటుంది. బ్యాంకుల విషయంలో కొత్త కొత్త నియమ నిబంధనలు తీసుకువస్తుంటుంది. చాలా మంది బ్యాంకు ఖాతాలను సరిగ్గా నిర్వహించకుంటే బ్యాంకులు అలాంటి ఖాతాలను డీయాక్టివేట్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల డీయాక్టివ్ ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేయాలని ఆదేశించింది. కేవైసీ పూర్తికాకపోవడం వల్ల కొంతమంది ఖాతాదారుల ఖాతాలు, ప్రాథమిక లోపాల కారణంగా కొందరి ఖాతాలు మూతపడ్డాయని ఆర్బీఐ డిసెంబర్ 2న నోటిఫికేషన్ జారీ చేసింది. వీలైనంత త్వరగా వాటన్నింటినీ యాక్టివేట్ చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.

విశేషమేమిటంటే.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలానికి ఇదే చివరి సమావేశం కావడం. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో కొత్త గవర్నర్‌ వస్తారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. మే 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. ఈసారి ఎంపీసీ వడ్డీరేట్ల తగ్గింపు తమకు ఊరటనిస్తుందని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలను ఎలా యాక్టివేట్ చేయాలి:

బ్యాంక్ ప్రకారం.. కస్టమర్‌లు ఈ దశలను అనుసరించడం ద్వారా వారి డార్మిటరీ ఖాతాలను తెరవవచ్చు. ముందుగా మీరు బ్యాంకు శాఖకు వెళ్లి మీ సంతకంతో దరఖాస్తును సమర్పించాలి. ఆ తర్వాత గుర్తింపు, చిరునామా స్వీయ-ధృవీకృత రుజువును సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీ ఖాతా యాక్టివేట్ చేస్తారు. ఆ తర్వాత మీ లావాదేవీలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు.

ఐడీఎప్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఖాతాను యాక్టివేట్‌ చేయడం ఎలా?:

IDFC ఫస్ట్ బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేయడానికి మీరు బ్యాంక్‌కి దరఖాస్తును సమర్పించాలి. మీరు మీ కేవైసీ సంబంధిత పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. దాని కోసం మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఖాతా యాక్టివేషన్ కోసం ఏ బ్యాంకు కూడా ఛార్జీ విధించదు.

ఎస్‌బీఐ ఖాతా యాక్టివేట్‌ కోసం..

ఇక ఎస్‌బీఐ అకౌంట్‌ డీయాక్టివ్ అయినట్లయితే ఆ ఖాతా ఉన్న కస్టమర్ తాజా కేవైసీ KYC డాక్యుమెంట్‌లతో ఏదైనా SBI బ్రాంచ్‌ని సందర్శించవచ్చు. ఆ తర్వాత అతను ఖాతాను యాక్టివేట్ చేయమని అభ్యర్థించాలి, ఆ తర్వాత బ్యాంక్ వివరాలను తనిఖీ చేసి ఖాతాను యాక్టివేట్ చేస్తుంది. మరియు కస్టమర్ ఈ సమాచారాన్ని SMS ద్వారా పొందుతారు.

ఇది కూడా చదవండి: Jio, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ నుంచి రెండు బెస్ట్‌ ప్లాన్స్‌.. ఇందులో ఏది బెటర్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి