Best 5G Phones: నమ్మలేని భారీ డిస్కౌంట్‌తో 5జీ బెస్ట్ ఫోన్లు.. ఆఫర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

స్మార్ట్ ఫోన్ అనేది నేడు ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. రోజూ నిర్వహించే వివిధ పనులకు తప్పనిసరి అవసరంగా రూపాంతరం చెందింది. మంచి పనితీరు, ఆకట్టుకునే డిజైన్ తో అన్ని ఫీచర్లు కలిగిన ఫోన్ ను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో 5జీ ఫోన్ల హవా నడుస్తోంది. ఈ రోజుల్లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలంటే సుమారు రూ.25 వేలు పెట్టాలని అందరూ భావిస్తారు. అయితే అంతకంటే తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ లో రూ.15 వేల లోపు ధరకే అందుబాటులో ఉన్న బెస్ట్ 5 జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.

Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 06, 2024 | 5:26 PM

ఇన్ఫినిక్స్ హాట్ 50  స్మార్ట్ ఫోన్ స్లీక్ బ్లాక్, వైలెట్ బ్లూ, డ్రీమీ పర్పుల్, సేజ్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా చూడవచ్చు. చిన్న పంచ్ హూల్, డైనమిక్ బార్ వంటి నిఫ్టీ ఫీచర్లు అదనపు ప్రత్యేకత. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.14,990కి అందుబాటులో ఉంది. దీనిలోనే 4 జీబీ ర్యామ్ వెర్షన్ ఫోన్ ను రూ.10 వేలకు కొనుగోలు చేయవచ్చు.

1 / 6
మోటరోలా జీ64 స్మార్ట్ ఫోన్ మెరుగైన ర్యామ్, బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. మీడియా టెక్ డైమెన్సిటీ 7025 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 50 ఎంపీ వైడ్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, సెల్పీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.

2 / 6
నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ 1 పనితీరు చాలా సమర్థంగా ఉంటుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉన్నాయి.  50 ఎంపీ వైడ్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 14తో రన్ అయ్యే ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో రూ.15,350కి ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

3 / 6
వీవో టీత్రీఎక్స్ ఫోన్ లో 44 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 8 ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్, 6.72 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి.  అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.13,789కి కొనుగోలు చేయవచ్చు.

4 / 6
మార్కెట్ లోని బెస్ట్ 5 జీ ఫోన్లలో మోాటరోలా జీ45 ఒకటి. దీనిలో 6.5 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 చిప్ సెట్, 4 జీబీ ర్యామ్ ఆకట్టుకుంటున్నాయి. కెమెరాల విషయానికి వస్తే వెనుక 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, ముందు 16 ఎంపీ ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, అద్బుతమైన రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్ లో రూ.13,249కి అందుబాటులో ఉంది.

5 / 6
రెడ్ మీ నోట్ 13 స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల అమెలెడ్ డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ అమర్చారు. 108 ఎంపీ వైడ్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, సెల్పీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. మార్కెట్ లో లభిస్తున్న నాణ్యమైన 5జీ ఫోన్లలో ఇది ఒకటి. ఈ ఫోన్ ను రూ.15,137 ధరకు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

6 / 6
Follow us