- Telugu News Photo Gallery Business photos Change in key rules in EPFO, No more Aadhaar for their claims, EPFO Rules details in telugu
EPFO Rules: ఈపీఎఫ్ఓలో కీలక నిబంధనల మార్పు.. ఇకపై వారి క్లెయిమ్స్‌కు నో ఆధార్
భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరికి రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా సొమ్ము పొదుపు చేస్తుంది. ఉద్యోగితో పాటు యజమాని సమానా వాటాతో ఉండే ఈ పీఎఫ్ విత్‌డ్రాకు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పీఎఫ్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన నిబంధనలు మార్చే అవకాశం ఉంది. ఆ నిబంధనల వివరాలను తెలుసకుందాం.
Srinu |
Updated on: Dec 06, 2024 | 5:30 PM

ప్రస్తుత రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ని ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లు చేయవచ్చు.

ఆదార్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవుతుంది. అలాగే రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్‌లను ప్రాసెసర్ చేయాలంటే యజమాని ధ్రువీకరణ తప్పనసరి అవుతుంది.

భారత్‌లో పనిచేసి, ఆధార్‌ను పొందలేకపోయిన అంతర్జాతీయ ఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులుశాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదని ఈపీఎఫ్ఓ ఇటీవల స్పష్టం చేసింది.

అయితే ఇలాంటి క్లెయిమ్‌లను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ అధికారులను ఆదేశించింది. ఇది అప్రూవల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ ద్వారా ఈ-ఆఫీస్ ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు.

ఉద్యోగులు అదే యూఏఎన్‌ను నిర్వహించాలని లేదా వారి మునుపటి సర్వీస్ రికార్డులను అదే యూఏఎన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది . ఎందుకంటే ఇది క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.





























