AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla Model Y crashes: ప్రయాణికుల భద్రతకు టెస్లా పెద్దపీట.. ఈ తాజా ఘటనే సాక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా కొన్ని మోడల్స్ ధర విషయంలో ఎలా ఉన్నా ప్రయాణికుల భద్రతకు హామీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎంత ఖరీదైన కారు కొనాలన్నా అందులోని భద్రతా ప్రమాణాల మేరకే కొనుగోలు  నిర్ణయం తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లు ఉన్నత వర్గాలను ఎంతగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ కారు ధర ఎంత ఉన్నా సరే టెస్లా కారంటే భద్రతకు హామీ అనే నమ్మకంతో కొనుగోలు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో టెస్లా వై సిరీస్‌కు సంబంధించిన కారు యాక్సిడెంట్ విజువల్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tesla Model Y crashes: ప్రయాణికుల భద్రతకు టెస్లా పెద్దపీట.. ఈ తాజా ఘటనే సాక్ష్యం
Tesla Car Crashes
Nikhil
|

Updated on: Jun 29, 2024 | 4:00 PM

Share

పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో టాప్ కంపెనీలు కార్ల మార్కెట్‌లో కూడా తమ హవాను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మోడల్స్ ధర విషయంలో ఎలా ఉన్నా ప్రయాణికుల భద్రతకు హామీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎంత ఖరీదైన కారు కొనాలన్నా అందులోని భద్రతా ప్రమాణాల మేరకే కొనుగోలు  నిర్ణయం తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లు ఉన్నత వర్గాలను ఎంతగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ కారు ధర ఎంత ఉన్నా సరే టెస్లా కారంటే భద్రతకు హామీ అనే నమ్మకంతో కొనుగోలు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో టెస్లా వై సిరీస్‌కు సంబంధించిన కారు యాక్సిడెంట్ విజువల్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కారు ఏడు పల్టీలు కొట్టినా సరే ప్రయాణికులకు ఏమీ కాకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్లా కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఈ యాక్సిడెంట్ సంఘటనకు ప్రతిస్పందనగా టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఒక ఎక్స్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, “భద్రత మా ప్రాథమిక రూపకల్పన లక్ష్యం” అని అన్నారు. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ నుంచి టెస్లా మోడల్ వై 2024 టాప్ సేఫ్టీ పిక్ + రేటింగ్ను సంపాదించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. మోడల్ Y ఈ సంవత్సరం ప్రారంభంలో సాధించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డు, మరింత కఠినమైన ప్రమాణాల కింద కూడా క్రాష్ టెస్లాలో వాహనానికి సంబంధించిన కచ్చితమైన స్కోర్లను ప్రతిబింబిస్తుంది. ఇక ఈ యాక్సిడెంట్ విషయానికి వస్తే మితిమీరిన వేగం కారణంగా వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ లేన్లలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అయితే వారి గాయాలు తీవ్రంగా లేవని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రమాదం సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వేగ పరిమితులను పాటించడం, అతివేగాన్ని నివారించడం చాలా ముఖ్యం. అయితే ఈ ఘటనకు సంబంధించిన కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. టెస్లా వంటి వాహన తయారీదారులు డిజైన్, ఇంజినీరింగ్ ద్వారా ప్రయాణీకుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ కారు భద్రతా సాంకేతికతలో గణనీయమైన పురోగతులను ఈ సంఘటన గుర్తు చేస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి