Kalki 2898 AD: ఆకట్టుకుంటున్న ప్రభాస్ కల్కీ బుజ్జీ కారు.. ఆకారంలోనే కాదు ఫీచర్స్‌లోనే టాప్ ప్లేస్..!

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు థియేటర్లలో దుమ్ముదులుపుతుంది. ఇందులో దిగ్గజ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో సహా స్టార్ స్టడెడ్ తారాగణం ఉంది. ఈ సినిమాలో ఎంత మంది యాక్టర్స్ ఉన్నా ఫ్యూచరిస్టిక్ ఏఐ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన బుజ్జి క్యారెక్టర్ అపారమైన ఉత్సుకతను రేకెత్తించింది.

Kalki 2898 AD: ఆకట్టుకుంటున్న ప్రభాస్ కల్కీ బుజ్జీ కారు.. ఆకారంలోనే కాదు ఫీచర్స్‌లోనే టాప్ ప్లేస్..!
Prabhas Bujji
Follow us

|

Updated on: Jun 29, 2024 | 4:30 PM

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు థియేటర్లలో దుమ్ముదులుపుతుంది. ఇందులో దిగ్గజ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో సహా స్టార్ స్టడెడ్ తారాగణం ఉంది. ఈ సినిమాలో ఎంత మంది యాక్టర్స్ ఉన్నా ఫ్యూచరిస్టిక్ ఏఐ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన బుజ్జి క్యారెక్టర్ అపారమైన ఉత్సుకతను రేకెత్తించింది. అయితే ఈ కారు ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. స్టార్ ట్రెక్, స్టార్ వార్స్‌ల హార్డ్‌కోర్ సైన్స్ ఫిక్షన్ అభిమానులై బుజ్జీ డిజైన్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీ బుజ్జీ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బుజ్జీ వాహనం మూడు భారీ టైర్‌లను కలిగి ఉంది. ముందు భాగంలో రెండు, వెనుక వైపు ఒక టైర్ ఉంటుంది. పూర్తి గ్లాస్ డోమ్‌తో వచ్చే ఈ కారు ఏ ఇతర భారతీయ చలనచిత్రంలో కూడా కనిపించదు. ముఖ్యంగా బుజ్జీ ముందు రెండు 34.5-అంగుళాల టైర్లు సీఎట్ తయారు చేసింది. అయితే అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. డబుల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో, వెనుక చక్రాల డ్రైవ్ మాన్‌స్టర్ మొత్తం 126 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌తో 9,800 ఎన్ఎం టార్క్‌ బుజ్జీ ప్రత్యేకత. 

బుజ్జీ కారు 47 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పైగా ఈ కారు రిమువబుల్ బ్యాటరీ సాంకేతికత ఆకట్టుకుంటుంది. బుజ్జి పొడవు 6,075 ఎంఎం, వెడల్పు 3,380 ఎంఎం, ఎత్తు 2,186 ఎంఎం. ఈ కారు ఈవీ సైన్స్ ఫిక్షన్ వాహనాన్ని లిమోసిన్ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కంటే 500 మిమీ పొడవుగా ఉంటుంది. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, బుజ్జికి ప్రాణం పోయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కారును మహీంద్రా, జయం ఆటోమోటివ్స్‌ సంస్థలు రూపొందించాయి. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, జయం ఇంజనీర్ల సహకార ప్రయత్నాలు ఈ బలీయమైన కారును నిర్మించడంలో కీలకపాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి