Recharge plan: వొడాఫోన్‌ కూడా పెంచేసింది.. టెలికం కంపెనీల బాదుడు..

ఇదిలా ఉంటే టెలికం కంపెనీల టారిఫ్‌ పెంపుతో యూజర్లపై భారీగా భారం పడునుంది. దేశంలోని మొబైల్ యూజర్లపై ఏటా ఏకంగా రూ. 47,500 కోట్ల అదనపు భారం పడనుందని నివేదికలు చెబుతున్నారు. దేశంలో 5జీ సేవలను తీసుకొచ్చేందుకు గాను కంపెనీలు ఇటీవల భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ రేట్లను సవరించినట్లు సమాచారం...

Recharge plan: వొడాఫోన్‌ కూడా పెంచేసింది.. టెలికం కంపెనీల బాదుడు..
Rechargle Plans
Follow us

|

Updated on: Jun 29, 2024 | 4:38 PM

దేశంలోని టెలికం కంపెనీలు వరుసగా టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెలకం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌లో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను సవరిస్తూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలు ఏకంగా 12.5 శాతం నుంచి అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పెంచేశాయి. పెరిగిన ధరలు జూల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కంపెనీలు ప్రకటించాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి వొడాఫోన్‌-ఐడియా కూడా వచ్చి చేరింది.

దేశంలో మూడో అతిపెద్ద టెలికం సంస్థ అయిన వొడాఫోన్‌-ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ టారిఫ్‌లను 10 నుంచి 21 శాతం వరకు పెంచాలని సర్వీస్ ప్రొవైడర్ నిర్ణయించింది. పెరిగిన ఈ ఛార్జీలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ. 179గా ఉన్న ప్లాన్‌ ఇప్పుడు రూ. 199గా మారనుంది. అలాగే రూ. 459 ప్లాన్‌ రూ. 509గా మారనున్నాయి.

ఇక 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 1799 ప్లాన్‌ను రూ. 1999కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌ విషయానికొస్తే ఇందులో రూ. 401 ప్లాన్‌ను రూ. 451కి పెంచారు. రూ. 501 ప్లాన్‌కు రూ.551 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీ ప్లాన్‌తో వొడాఫోన్‌ అందిస్తున్న రూ. 601 ప్లాన్‌ ఇకపై రూ. 701గా మారనుంది. అలాగే రూ. 1001 ప్లాన్‌ కోసం ఇకపై రూ. 1201 చెల్లించాలి. ఇదిలా ఉంటే ప్రీపెయిడ్‌ యూజర్లకు రాత్రిపూట ఉచిత డేటాను అందించే ఏకైక ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా అని కంపెనీ తెలిపింది. 4జీలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నామని, 5జీ మొబైల్ సేవలను ప్రారంభించబోతున్నామని కపెంనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే టెలికం కంపెనీల టారిఫ్‌ పెంపుతో యూజర్లపై భారీగా భారం పడునుంది. దేశంలోని మొబైల్ యూజర్లపై ఏటా ఏకంగా రూ. 47,500 కోట్ల అదనపు భారం పడనుందని నివేదికలు చెబుతున్నారు. దేశంలో 5జీ సేవలను తీసుకొచ్చేందుకు గాను కంపెనీలు ఇటీవల భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ రేట్లను సవరించినట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో భారత్ రికార్డ్‌.. చైనాను వెనక్కి నెట్టి
స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో భారత్ రికార్డ్‌.. చైనాను వెనక్కి నెట్టి
కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా?
కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా?
ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. 3 లక్షలు.. అంతలా ఏముందనేగా..
ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. 3 లక్షలు.. అంతలా ఏముందనేగా..
భార్యను కాపురానికి పంపట్లేదని భర్త ఫ్రస్ట్రేషన్.. ఏం చేశాడంటే
భార్యను కాపురానికి పంపట్లేదని భర్త ఫ్రస్ట్రేషన్.. ఏం చేశాడంటే
రోజూ మల్టీవిటమిన్స్‌ తీసుకుంటున్నారా? సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా
రోజూ మల్టీవిటమిన్స్‌ తీసుకుంటున్నారా? సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా
టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో 'ఆ నలుగురు'..
టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో 'ఆ నలుగురు'..
జలపాతంలో ఈత కొట్టేందుకు వెళ్లి అదృశ్యమైన యువకుడు.. వీడియో
జలపాతంలో ఈత కొట్టేందుకు వెళ్లి అదృశ్యమైన యువకుడు.. వీడియో
తొలకరి జల్లుల్లో వజ్రాల వేట.. దొరికినోడికి దొరికినంత..
తొలకరి జల్లుల్లో వజ్రాల వేట.. దొరికినోడికి దొరికినంత..
మీరు త్వరగా బరువు తగ్గాలా.. అయితే సోంపు వాటర్ తాగండి!
మీరు త్వరగా బరువు తగ్గాలా.. అయితే సోంపు వాటర్ తాగండి!
వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు
వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు