AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla: భారత్‌లో టెస్లా దూకుడు.. రెండో షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో తమ అమ్మకాలను మరింత పెంచే ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇప్పటికే ముంబైలో లొలి షోరూమ్‌ను ఏర్పాటు చేస్తూ భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన టెస్లా.. నెల రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో తన రెండో షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త టెస్లా షోరూమ్‌ను ప్రారంభించింది.

Tesla: భారత్‌లో టెస్లా దూకుడు.. రెండో షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
Tesla
Anand T
|

Updated on: Aug 11, 2025 | 5:01 PM

Share

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో తమ వాహనాల మార్కెట్‌ను వేగంగా పెంచుకుంటుంది.ఇప్పటికే ముంబైలో లొలి షోరూమ్‌ను ఏర్పాటు చేస్తూ భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన టెస్లా.. నెల రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో తన రెండో షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ షోరూమ్‌ను కేవలం కార్ల విక్రయ కేంద్రంగా మాత్రమే కాకుండా, ఒక అద్బుతమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనుంది. ఈ షోరూమ్‌లో ప్రస్తుతానికి టెస్లా( మోడల్‌ Y) కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఈ కార్లను దగ్గరగా పరిశీలించవచ్చు. కారు కొనుగోలు ప్రక్రియతో పాటు చార్జింగ్ ఆప్షన్ల గురించి పూర్తి వివరాలను ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ప్రస్తుతం భారత మార్కెట్లోకి టెస్లా “మోడల్ వై’ను మాత్రమే అందుబాటులోకి తీకొచ్చింది. ఇందుకు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒకటి స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ దీని ధర రూ. 59.89 లక్షలుగా టెస్లా పేర్కొంది. ఇక రెండో వేరియంట్ విషయానికి వస్తే లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ దీని ధర రూ. 67.89 లక్షలుగా టెస్లా నిర్ణయించింది. గత నెల నుంచి వీటి కోసం బుకింగ్స్‌ ఒపెన్‌ చేసిన టెస్లా బుక్‌ చేసుకున్న వారికి 2025 మూడవ త్రైమాసికం నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్టు పేర్కొంది. పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్లపై భారీ దిగుమతి సుంకాలు ఉండటం వల్ల ధరలు అంతర్జాతీయ స్థాయిల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి, ఇది దాదాపు ధరను రెట్టింపు చేస్తుంది.

ఇక ఈ కార్ల ఫర్ఫామెన్స్‌ విషయానికి కొస్తే.. స్టాండర్డ్ RWD మోడల్‌ ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ.ల రేంజ్‌ని అందిస్తుంది, లాంగ్ రేంజ్ RWD మోడల్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే.. ఇది 622 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌ 0 నుండి 100 కి.మీ.ల స్పీడ్‌ను కేవలం 5.9 సెకన్లలోనే అందుకుంటుంది. ఇక లాంగ్ రేంజ్ వెర్షన్ కి 5.6 సెకన్లలో 0 నుంచి 100 స్పీడ్‌ను అందుకుంటుంది. ఈ రెండూ వేరియంట్‌లు 201 కి.మీ.ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి. ఫాస్ట్ చార్జర్‌తో కేవలం 15 నిమిషాల్లోనే స్టాండర్డ్ మోడల్ 238 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ మోడల్ 267 కిలోమీటర్ల రేంజ్‌ను తిరిగి పొందగలవని టెస్లా పేర్కొంది. ఈ మోడల్ Y మెరుగైన ఏరోడైనమిక్స్ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుని మినిమలిస్ట్ డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.