Tesla Cybertruck: టెస్లా కారుపై రోబో దాడి.. బుల్లెట్ల వర్షం.. చివరికి ఏమైందంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ నుంచి సైబర్ ట్రక్ ఇటీవల లాంచ్ అయ్యింది. అమెరికాలో గ్రాండ్ గా దీనిని మస్క్ ఆవిష్కరించారు. కేవలం ఆవిష్కరించడం మాత్రమే కాక దాని పనితీరుని వివరిస్తూ పలు టెస్టింగ్ వీడియోలు విడుదల చేశారు. దీంతో ఈ సైబర్ ట్రక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మొత్తం బుల్లెట్ బాడీతో వస్తుంది.
ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా మరో సరికొత్త ఉత్పత్తితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ నుంచి సైబర్ ట్రక్ ఇటీవల లాంచ్ అయ్యింది. అమెరికాలో గ్రాండ్ గా దీనిని మస్క్ ఆవిష్కరించారు. కేవలం ఆవిష్కరించడం మాత్రమే కాక దాని పనితీరుని వివరిస్తూ పలు టెస్టింగ్ వీడియోలు విడుదల చేశారు. దీంతో ఈ సైబర్ ట్రక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మొత్తం బుల్లెట్ బాడీతో వస్తుంది. వాస్తవానికి ఈ సైబర్ ట్రక్ ను నాలుగేళ్ల క్రితమే ఆవిష్కరించారు. అయితే పలు విధాలుగా పరీక్షలు చేసిన తర్వాత ఎట్టకేలకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇది అందరి అంచనాలకు మించి సూపర్ లుక్, స్టన్నింగ్ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఎలాన్ మస్క్ దీనిని అనే రకాలు పరీక్షలు చేశారు. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి కారుపై బుల్లెట్ల వర్షం కురిపించి, నాణ్యతను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రోబోలతో చేసిన ఓ పరీక్ష ఇప్పుడు వైరల్ అయ్యింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సైబర్ ట్రక్ ఇలా..
టెస్లా సైబర్ ట్రక్ పూర్తి బుల్లెట్ ప్రూఫ్ కాన్సెప్ట్ తో వస్తుంది. దీనిలోమూడు వేరియంట్లు ఉన్నాయి. బేస్ లెవెల్ వేరియంట్ ఆర్ డబ్ల్యూడీ, డ్రైవ్ ట్రెయిన్, మిడ్ స్పెక్ వేరియంట్ ఏడబ్ల్యూడీ డ్రైవ్ ట్రెయిన్, టాప్ స్పెక్ వేరియంట్ సైబర్ బీస్ట్ అనే వేరియంట్లు ఉన్నాయి. ఈ సైబర్ బీస్ట్ లో కూడా ఏడబ్ల్యూడీ డ్రైవ్ ట్రెయిన్ ను కలిగి ఉంది. ఈ మూడు వేరియంట్లలో ప్రస్తుతం టెస్లా ఏడబ్ల్యూడీ డ్రైవ్ ట్రెయిన్, సైబర్ బీస్ట్ వేరియంట్లు మాత్రమే డెలివరీలకు అందుబాటులో ఉంచింది. ఆడబ్ల్యూడీ డ్రైవ్ ట్రెయిన్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.
రోబోలతో బుల్లెట్ ప్రూఫ్ టెస్ట్..
ఈ సైబర్ ట్రక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు టెస్లా అనేక రకాలైన సామర్థ్య పరీక్షలు నిర్వహించింది. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ టీరియర్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దింది. దీని కోసం స్టెయిన్ లెస్ స్టీల్ ను వినియోగించింది. దీని శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు టెస్లా ఈ కారు లాంచింగ్ సమయంలో వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో సైబర్ ట్రక్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ బెల్లెట్ల వర్షం కురిపించింది ఎవరో తెలుసా? ఓ రోబో. అవునండి నిజమే.. ఓ రోజో సైబర్ ట్రక్ ను డ్రైవ్ చేస్తుండగా.. మరో రోబో ఆ కారుపై గన్ తో బుల్లెట్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ ఆ కారుకు చిన్న డ్యామేజ్ కూడా కాకపోవడం గమనార్హం.
Teslabot tests the bulletproof capabilities of Cybertruck 😂 #Cybertruck #TeslaCybertruck #Tesla #Teslabot pic.twitter.com/hIGWNBXKV4
— Tesla Motors Community (@CommunityTesla) December 1, 2023
సైబర్ ట్రక్ ధర..
ఈ సైబర్ ట్రక్ మూడు వేరియంట్ల ధరలను ఓ సారి పరిశీలిస్తే 60,990డాలర్ల నుంచి ప్రారంభమై 99,990 డాలర్ల వరకూ ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే వీటి ధరలు రూ. 50.82లక్షల నుంచి ప్రారంభమై రూ. 83.30లక్షల రేంజ్ లో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..