Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రెండు లక్షలు చేసిన స్టాక్.. అందులోనూ టాటాలు వాటాలు కొన్న షేర్..

Multibagger Returns: టెలికాం రంగంలో సేవలు అందించే ఈ కంపెనీ తన పెట్టుబడి దారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. దేశంలో 5G సేవలు ప్రారంభించనున్న తరుణంలో ఈ షేర్ మరింతగా మదుపరుల ఆదరణ పొందింది.

Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రెండు లక్షలు చేసిన స్టాక్.. అందులోనూ టాటాలు వాటాలు కొన్న షేర్..
stock Market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 11, 2022 | 6:47 AM

Multibagger Returns: టెలికాం రంగంలో(Telecom Stock) సేవలు అందించే ఈ కంపెనీ తన పెట్టుబడి దారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. దేశంలో 5G సేవలు ప్రారంభించనున్న తరుణంలో ఈ షేర్ మరింతగా మదుపరుల ఆదరణ పొందింది. తేజాస్ నెట్‌వర్క్స్(Tejas networks) షేరు కేవలం ఏడాదిలోనే తన షేర్‌హోల్డర్లకు అద్భుతమైన రిటర్నులను ఆఫర్ చేసింది. ఏడాది క్రితం ఈ కంపెనీ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.2.09 లక్షలు వచ్చుండేవి. అంటే 109 శాతం రిటర్నులను ఈ స్టాక్ అందించింది. బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం మన పెట్టుబడి రెండితలు కావటానికి కనీసం 7 సంవత్సరాలు పడుతుంది. కానీ.. ఈ షేర్ మాత్రం దానిని ఒక్క ఏడాదిలోనే అందించి స్మాల్‌క్యాప్ కేటగిరీలో బెస్ట్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.

కంపెనీలో టాటా సన్స్ మెజారిటీ వాటాను కొనుగోలు చేయబోతుందనే వార్తలతో.. ఈ మల్టీ బ్యాగర స్టాక్ లో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. మార్కెట్ సమాచారం మేరకు.. టాటా సన్స్‌కు(Tata Sons) చెందిన సబ్సిడరీ కంపెనీ అయిన పానటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ ఈ కంపెనీలో 37.37 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. గత త్రైమాసికాల్లో కంపెనీ ఆశాజనకమైన రిజల్ట్స్ అందించకపోయినప్పటికీ.. రూ. 500 రేటును దాటింది. తాజా త్రైమాసిక ఫలితాలతో షేర్ ధర కొంత పతనాన్ని నమోదు చేసింది. ఈ స్టాక్ మల్టిబ్యాగర్ స్టేటస్‌ను కలిగి ఉంది.

తేజాస్ నెట్‌వర్క్స్ షేర్ మంచి పనితీరును కనబరుస్తోంది. దీని వ్యాపారం, లాభాలు క్రమక్రమంగా పెరుగుతున్నందున రానున్న కాలంలో ఈ షేర్ మరింద మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెట్‌వర్కింగ్ ప్రొడక్టులను డిజైన్ , డెవలప్మెంట్, తయారీ చేసి విక్రయించటంలో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటిని హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో వాడతారు.

ఇవీ చదవండి..

Viral Video: డాడీ నువ్వు మాతో వచ్చెయ్.. యుద్ధ భూమిలో ఆ సంఘటన చూస్తే మీకు కన్నీళ్లు రాక మానవు..

Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!